పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉన్న ఒకేఒక్క హీరోయిన్ సమంత అనే చెప్పొచ్చు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కమర్షియల్ సినిమాల కన్నా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కు ప్రాముఖ్యత ఇస్తున్న సమంత ఇప్పటికి అదే ఫాం కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన జాను సినిమాలో సమంత అభినయానికి ఆమె అభిమానులే కాదు సగటు సిని ప్రేక్షకుడు కూడా సర్ ప్రైజ్ అయ్యాడు. ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ గా సమంత వెబ్ సీరీస్ లకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఇప్పటికే అమేజాన్ ప్రైం ఫ్యామిలీ మ్యాన్ సీక్వల్ లో సమంత నెగటివ్ రోల్ చేస్తుందని తెలుతుంది.

 

ఇది కాకుండా రీసెంట్ గా అల్లు అరవింద్ విత్ పార్ట్ నర్స్ తో మొదలుపెట్టిన ఆహా ఓటిటిలో కూడా సమంత వెబ్ సీరీస్ లు చేయబోతుందని తెలుస్తుంది. అక్కినేని కోడలు క్రేజ్ ను వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిన అల్లు అరవింద్ ఆహా కోసం సమంత బల్క్ డేట్స్ తీసుకున్నాడట. నెల రోజుల సమంత డేట్స్ తీసుకుని ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట. మాములుగా సినిమాల కోసం ఇచ్చినట్టుగానే సమంతకు వెబ్ సీరీస్ కు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

 

వెబ్ సీరీస్ లో క్లిక్ అయితే ఇక సినిమాలు తగ్గించి పూర్తిగా వెబ్ సీరీస్ ల మీదే దృష్టి పెట్టాలని చూస్తుంది సమంత. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో సమంత మాత్రమే ఫుల్ ఫామ్ లో ఉంది. ఆమె తర్వాతనే నాగ చైతన్య వస్తాడు. చైతు కూడా లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్నాడు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా నాగ్ కు లాక్ కలిసి వస్తుందో లేదో చూడాలి. ఎవరెలా ఉన్నా సమంత మాత్రం సినిమాలు. వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: