కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం తో ఇప్పుడు షూటింగ్ ఆగిపోయింది. భారీ ప్రమాదం జరగడంతో షూటింగ్ ని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదం మీద విచారణ జరుగుతుంది. దర్శకుడు శంకర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. కేసుని అధికారులు సీరియస్ గా తీసుకోవడంతో దీని వెనుక తప్పులు అన్ని శంకర్ కారణంగానే జరిగాయని అధికారులు భావిస్తున్నారు. 

 

కనీస జాగ్రత్తలు దర్శకుడు తీసుకోలేదు అంటున్నారు. అయితే ఇప్పుడు శంకర్ ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన మరో రెండేళ్ళ పాటు సినిమాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో శంకర్ ఉన్నారని, ఆ గాయాలు నయం అయి వాటికి కొన్ని సర్జరీలు కూడా జరగాలని అంటున్నారు. అవి అన్నీ పూర్తి అయి ఆయన షూటింగ్ లోకి రావడానికి రెండేళ్ళు కచ్చితంగా పడుతుంది అంటున్నారు. దీనితో భారతీయుడు 2 సినిమా ఆగిపోయినట్టే అంటున్నారు కొందరు. 

 

అటు తమిళ మీడియా కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఆగిపోయింది అనే చెప్తుంది తమిళ మీడియా. ఒకవేళ షూటింగ్ చేసినా రెండేళ్ళ తర్వాతే అంటున్నారు. దీనితో కమల్ హాసన్ కొన్ని రోజులు ఆగి వేరే సినిమాలను ఓకే చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కాగా మృతి చెందిన ముగ్గురికి భారీగా సహాయం చేసినా సరే కేసులు వెంటాడుతున్నాయి. శంకర్ కోలుకున్నా సరే కేసులు మాత్రం ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉందని సమాచారం. దీనితోనే షూటింగ్ ని ఆపెస్తారని ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఎం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: