నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వి లో తొలిసారిగా నెగటివ్ రోల్ లో నటిస్తున్న నాని, తప్పకుండా ఈ సినిమాలోని తన క్యారెక్టర్ ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా నచ్చి తీరుతుందని అంటున్నారు. ఇకపోతే నేడు తన 36వ పుట్టినరోజుని జరుపుకున్న నాని, తన కొత్త కొత్త సినిమాని కూడా ప్రకటించారు. 

 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పిడివి ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మాణంలో యూత్ఫుల్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ నూతన సినిమాకు శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ ని నిర్ణయించిన సినిమా యూనిట్, నానికి బర్త్ డే విషెస్ తెల్పుతూ వినూత్నంగా మూవీ టైటిల్ ని యూట్యూబ్ లో ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఇది కెరీర్ పరంగా నానికి 27వ సినిమా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు ప్రకటించారు. 

 

గతంలో యూత్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ట్యాక్సీ వాలా సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ కు ఇది దర్శకుడిగా రెండవ సినిమా. దర్శకుడిగా తెరకెక్కించిన టాక్సీ వాలా ప్రేక్షకులను పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకోవడంతో, ఎలాగైనా ఈ సినిమాతో తప్పకుండా మంచి హిట్ కొట్టేలా దర్శకుడు రాహుల్సినిమా కథ, కథనాలు రాసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, అలానే సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో అధికారికంగా తెలియపరుస్తాం అని సినిమా యూనిట్ తెలిపింది..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: