రెండు అక్షరాల పదం ప్రేమ .. రెండు జీవితాల కలయిక పెండ్లి.. ప్రేమతో మనస్సులు కలిస్తే.. పెండ్లితో అనుబంధం బలపడుతుంది. ప్రేమ అంటే ఆకర్షణ కాదు.. రెండు గుండెల్లో చిగురించిన ప్రేమ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. విద్వేషాలకు తావివ్వకుండా.. మనస్పర్థలకు చోటు లేకుండా.. కడదాక కొనసాగితేనే ప్రేమకు అర్థం పరమార్థం. అయితే ప్రేమకు జాతి లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎల్లలు లేనిది ప్రేమ.. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఆర్యవర్థన్, అను నిరూపిస్తున్నారు. ‘ప్రేమ ఎంత మధురం’ అనే సరికొత్త సీరియల్‌తో జీ తెలుగులో ఫిబ్రవరి 10 నుంచి టెలికాస్ట్ అవుతోంది.

 

ఇప్ప‌టికే బుల్లితెర‌పై పోటీ జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.ధారావాహికలు,సరికొత్త సినిమాలను టెలికాస్ట్ చెయ్యడంలో కానీ అలాగే ప్రోగ్రామ్స్ మరియు ఈవెంట్స్ లలో కానీ ఏదొక విధంగా మంచి పోటీ వాతావరణం ఎప్పటికీ నెలకొంటూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జీ తెలుగు ఛానెల్లోని కేవలం నెల వ్యవధిలోనే మూడు సరికొత్త ధారావాహికలు మొదలయ్యాయి.అలా మొదలైన వాటిలో `ప్రేమ ఎంత మధురం` సీరియ‌ల్ ఒక‌టి. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్ ఇది.

 

ఇక ఈ సీరియ‌ల్‌కు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టిందట. ముఖ్యంగా అయితే యూత్ ఈ సీరియల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. రెండు వారాల నుంచి టెలికాస్ట్ కాబడిన ఈ సీరియల్ దాదాపు 6 టీఆర్పీ రేటింగ్ రాబడుతున్నట్టు సమాచారం. ఈ సీరియ‌ల్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌మోట్ చేయ‌డంతో మ‌రింత హైప్ క్రియేట్ అయింది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్‌ నటీనటుల విషయానికి వస్తే.. ఆర్య వర్థన్‌ పాత్రలో వెంకట్‌ శ్రీరామ్‌ నటించగా, అను కేరక్టర్‌లో వర్ష హెచ్‌కె నటించింది. హైదరాబాద్‌ నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు డిఫరెంట్‌ బ్యాక్‌గ్రౌండ్స్‌ కలిగిన ఆర్యవర్థన్‌, అను మధ్య పుట్టిన ప్రేమే అసలు కథాంశం. మ‌రి ముందు ముందు ఈ సీరియ‌ల్ ఇకెంత ఆక‌ర్షిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: