అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు భారత్ లో అడుగుపెట్టిన ఆయన నేరుగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి కాసేపు గడిపిన ట్రంప్... గాంధీ జీవిత విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధాని కూడా గాంధి జీవన విధానాలను ట్రంప్ కి వివరించారు. ఇక అక్కడ చరఖా గురించి వివరాలు అడిగి తెలుసుకుని దాన్ని కాసేపు పరీక్షగా చూసారు. అక్కడ ఉన్న సహాయకులు ట్రంప్ కి దాని పని తీరుని వివరించారు. 

 

ఇక అక్కడి నుంచి నేరుగా ఆయన మోతెరా స్టేడియం కి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశానికి ఎత్తేసారు ఆయన. ఆ తర్వాత ఆగ్రా చేరుకొని 5 గంటలకు తాజ్ మహల్ ని సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెద్ కుష్ణర్ తో కలిసి వీక్షించారు. ఇక ఇదిలా ఉంటే... సబర్మతి ఆశ్రమం నుంచి బయటకు వచ్చే సమయంలో ట్రంప్ అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేసారు. 

 

అలాగే ఆగ్రా లో సంతకం చేసారు. ఈ సంతకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే రకంగా వైరల్ అవుతున్నాయి. అది ఎలా అంటే, ట్రంప్ సంతకం ఉన్న ఫోటోతో నందమూరి బాలకృష్ణ సంతకం ఉన్న ఫోటోను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు సంతకాలను ప్రపంచంలో ఎవరు కాపీ కొట్టలేరు అంటూ వాళ్లిద్దరు సంతకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ట్రంప్ ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ విందు అనంతరం ఐటీసీ మౌర్య హోటల్ లో ట్రంప్ దంపతులు బస చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: