శ్రీదేవి.. అందాల తార.. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువె.. ఎందుకంటే ఆమె ఓ సహజ నటి.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక నటి శ్రీదేవి. అలాంటి ఈ శ్రీదేవి.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది.. అగ్ర హీరోలకు మానవరాలిగా నటించి వాళ్ళ పక్కనే హీరోయిన్ గా నటించిన ఏకైక నటి శ్రీదేవి. 

 

కేవలం ఆ అగ్ర హీరోలకు హీరోయిన్ గా కాదు.. వాళ్ళ కొడుకులకు కూడా నటిగా చేసిన ఏకైక నటి ఈ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి ఎన్నో గొప్ప సినిమాలు చేసింది. సహజ నటనతో తెలుగు, తమిళ్, హిందీ అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటనను చూసి హాలీవుడ్ సైతం ఆమెను ఆహ్వానించింది.. కానీ శ్రీదేవి హాలీవుడ్ లో నటించలేదు. 

 

అయినప్పటికీ ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సింగపూర్‌లో 'దిల్లీ రెస్టారెంట్' అనే హోటల్ ఒకటి ఉంది. అదేంటి ఎన్నో హోటళ్లు ఉంటాయి కదా దీని గురించే ఎందుకు అనుకుంటున్నారా? ఉంది అక్కడే విషయం ఉంది.. క్లిఫర్డ్ టాన్, డయానా అనే దంపతులు 1988 నుంచి ఇండియన్ రెస్టారెంట్ ను అక్కడి రేస్ కోర్స్ రోడ్‌లో నిర్వహిస్తున్నారు. 

 

ఆ రెస్టారెంట్ లో అడుగు పెట్టగానే ఓ అందమైన బొమ్మ కనిపిస్తుంది.. ఆ బొమ్మను చూస్తే అచ్చం శ్రీదేవిలా కనిపిస్తుంది. మొదట బొమ్మ అనుకున్నప్పటికి ఆ తర్వాత అర్థం అవుతుంది. అది శ్రీదేవి విగ్రహం అని. అచ్చమైన చీరకట్టుతో, ఒంటినిండా నగలు ధరించి సంప్రదాయబద్ధంగా ఉన్న శ్రీదేవి పింగాణీ బొమ్మను సింగపూర్ హోటల్ లో పెట్టారు.

 

అంతేకాదు.. ఆ హోటల్ లో ఆమె గొప్పతన్నాని వివరిస్తూ.. కొంత సమాచారం కూడా ఉంటుంది.. మొదట వారు బిసినెస్ కోసం ఆమె విగ్రహాన్ని చేసినప్పటికీ చివరికి ఆ విగ్రహమే వారి హోటల్ కు ఎంతో ఆకర్షణీయంగా మారిపోయింది. అక్కడికి వెళ్లిన ప్రతి భారతీయుడు ఆ విగ్రహం గురించి మాట్లాడి వస్తాడు.. ఇప్పుడు అయితే ఆ విగ్రహంతో సెల్ఫీ తీసుకోకుండా రారు. 

 

ఆ బొమ్మను ఆ రెస్టారెంట్ పెట్టడానికి కారణం ఆమె నటన అనే చెప్తారు ఆ సింగపూర్ దంపతులు. ముందుగా వారికీ ఆమె గురించి ఏమి తెలియదు అని.. కానీ ఆ రెస్టారెంటుకు వచ్చే భారతీయుల ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్నారు అని.. ఆతర్వాత ఆమె సినిమాలు చూసి అభిమానులుగా మారి ఏకంగా ఆమె విగ్రహాన్నీ వారి రెస్టారెంట్ లో పెట్టించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: