జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే చాలు ఎదుటోళ్లు ఫిదా అవ్వాల్సిందే అని చాలా మంది చెబుతారు. ఆ మాట సాయం కోసమే కొంతమంది పొలిటీషియన్స్ కూడా తారక్ ను జనాల్లోకి పిలుస్తుంటారు. అయితే ఈ మాటల్లోనే  కాదు, తారక్ పాటల్లో కూడా మత్తు ఉంది. అందుకే తమిళ, కన్నడ స్టార్లు జూనియర్ గొంతుతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ ఏ ఫీలింగ్ నైనా అందమైన మాటలతో ఎక్స్ ప్రెస్ చేస్తాడు. కన్వెన్సింగ్ స్పీచ్ లతో  ఎదుటివాళ్లను పడేస్తాడు. అందుకే ఇతని ఫ్రెండ్ లిస్ట్ లో చాలామంది స్టార్లున్నారు. హైదరాబాద్ నుంచి మొదలుపెడితే, బెంగళూరు, చెన్నై ఇలా భాషతో పనిలేకుండా చాలామంది హీరోలు తారక్ తో కలిసి గ్యాంగ్ ఫామ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ స్టార్స్ తో బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఉంది. మహేశ్ బాబు, రామ్ చరణ్ తో పార్టీలు చేసుకుంటూ సోషల్ మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఈ స్నేహాన్ని మరోస్థాయికి తీసుకెళ్తూ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. 

 

తారక్ తన స్నేహాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీకి విస్తరిస్తున్నాడు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ తో చక్రవ్యూహ సిినిమాలో గెలయా గెలయా అనే పాట పాడాడు. ఇప్పుడు విజయ్ కోసం గొంతెత్తుతున్నాడు తారక్. మాస్టర్ లో ఇళయదళపతి పాడిన కుట్టి స్టోరీ తెలుగు వెర్షన్ ను తారక్ పాడబోతున్నాడని చెబుతున్నారు.

 

మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సర్వకళా వల్లభుడు అనిపించుకున్నడు. ఇప్పటికే డైలాగ్ కింగ్ గా పేరుతెచ్చుకున్న నందమూరి నట వారసుడు వాయిస్ ఓవర్, పాటల్లో కూడా తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. తమిళ, కన్నడ స్టార్లు ఈయన గొంతంటే పడిచస్తున్నారు.  ఒక్కసారి ప్లీజ్ అంటూ వెంటపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: