టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో సీనియర్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ గా మారిన స్టార్ హీరోయిన్ నయనతార. మొదటి సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఎంట్రీ ఇచ్చి ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఫేమస్ అయింది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఎన్.టి.ఆర్ వంటి స్టార్ హీరోల తో పాటు, కోలీవుడ్ లో రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి స్టార్స్ తో నటించి ఒక వెలుగు వెలుగుతున్నారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ అన్న పేరు దక్కించుకున్నారు. అయితే నయన తారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతగా క్రేజ్ ఉందో అంతగా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నయనతార విషయంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారట. 

 

నయనతార మీద ఉన్న ముఖ్యమైన కంప్లైంట్స్ రెగ్యులర్ గా వినిపించేది ఆవిడ ప్రమోషన్స్ విషయంలో సపోర్ట్ చేయరని. స్టార్ హీరో సినిమా అయినప్పటికి నయనతార ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని అలాగే, ప్రమోషనల్ కార్యక్రమాలకి గాని రారని నిర్మాతలు వాపోతుంటారు. ఇదే కాదు ముందు అనుకున్న షూటింగ్ డేట్స్ కాకుండా అదనపు రోజుల్లో షూటింగ్ కు రమ్మంటే అందుకు ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తుందని టాక్ ఉంది. 

 

అంతేకాదు కోలీవుడ్.. టాలీవుడ్ సినిమా ఏదైనా కూడా షూటింగ్ లొకేషన్ కి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ప్రతీది నిర్మాతే చూసుకోవాలట. అంతేకాదు నయనతార తో పాటు తన వెంట ఉండే స్టాఫ్ అంటే హేయి డ్రెస్సెర్, పర్స్నల్ మేకప్ మాన్ కి నిర్మాతే డబ్బు చెల్లించాలని నయనతార నిర్మాతతో ఖచ్చితంగా చెబుతుందట. దాంతో నిర్మాతకి నయనతార కి అనుకున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్టు అవుతుందని అది నిర్మాతకి భారంగా అవుతుందని ఈ విషయంలో నయనతార మారాలని అంటున్నారట. మరి ఇది నయనతార పట్టించుకుంటుందో పెడ చెవిన పెడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: