ఈ మధ్య సోషల్ మీడియాలో సినిమా కి సంబంధించిన ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఏ కొత్త సినిమా వచ్చినా సరే సోషల్ మీడియానే సినిమాకు చాలా కీలకం అవుతుంది. ఏ సినిమా విడుదల అవుతున్నా సరే చిత్ర యూనిట్ ఇప్పుడు  సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రచారం చేస్తూ వస్తుంది. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. సినిమాకు అదే ప్రధాన బలం అవుతుంది ఈ మధ్య. సోషల్ మీడియా లేకుండా సినిమా ఉండటం లేదు. 

 

అయితే ఇప్పుడు సినిమాను సోషల్ మీడియానే ఇబ్బంది పెడుతుంది. సోషల్ మీడియాలో సినిమా బాగుంది అంటే బాగుంది. సినిమా బాగాలేదు అంటే బాగాలేదు. సినిమా మొదలైన నాటి నుంచి విడుదల అయ్యే వరకు, విడుదల అయిన తర్వాత వసూళ్ళ నుంచి ప్రతీ ఒక్కటి సోషల్ మీడియా కేంద్రంగానే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పుడు ఇదే సినిమాకు ప్రధానంగా మైనస్ అవుతుంది అంటున్నారు. సినిమా జయాపజయాలను సోషల్ మీడియాలో నిర్దేశిస్తుంది. ఇటీవల మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను సోషల్ మీడియా బాగా ఇబ్బంది పెట్టింది. 

 

సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అనేది కొందరి వాదన. అలాగే విజయ్ దేవరకకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా ఇలాగే సోషల్ మీడియా కారణంగా చాలా ఇబ్బందులు పడింది అనే చెప్పవచ్చు. సినిమా వరల్డ్ ఫేమస్ రాడ్ అనే కామెంట్ రావడంతో సినిమా చూడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇలా సినిమా వసూళ్ళ విషయంలో కూడా కొందరు చేస్తున్న ప్రచారం ఇబ్బందికరంగా మారుతుంది. సినిమా గురించి కొంత వరకు కామెంట్ చేయడంలో ఇబ్బంది లేదు గాని ట్రోల్ చేయడంతో సినిమా ఇబ్బంది పడుతుంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: