సక్సెస్ హ్యాంగోవర్ బోల్డంత్ హాయిగా ఉంటుంది. అయితే ఈ కిక్ ని అలాగే కంటిన్యూ చేయాలంటే తర్వాతి స్టెప్ చాలా సర్ ప్రైజింగ్ గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కు కిక్ వస్తుంది. అల్లు అర్జున్ కూడా ఇలాగే ఆడియన్స్ ను మెప్పించేందుకు సర్ ప్రైజింగ్ ప్యాకేజీ సిద్దం చేస్తున్నాడు. 

 

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆడియన్స్  కూడా ఈ సిత్తరాల సిరపడు చేసిన హంగామాను మరిచిపోలేకపోతున్నారు. ఇక బన్ని ఫ్యాన్స్ అయితే రాములో రాములా అంటూ డ్యాన్సులు చేస్తున్నారు. అంతలా కనెక్ట్ అయిన ఆడియన్స్ ను వైకుంఠపురము నుంచి బయటకు తీసుకురావడానికి లారీ డ్రైవర్ లా మారుతున్నాడు బన్ని. 

 

అల్లు అర్జున్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్ని రెండు షేడ్స్ లో కనిపిస్తాడనే  టాక్ వస్తోంది. ఒక షేడ్ లో లారీ డ్రైవర్ గా ఫుల్ రఫ్ లుక్ లో దర్శనమిస్తాడని చెబుతున్నారు. ఈ లుక్ కోసం ముంబయి స్టైలిష్ట్ లు వర్క్ చేశారనే ప్రచారం జరుగుతోంది. 

 

అల్లు అర్జున్ ఓ వైపు రఫ్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తూనే.. క్లాస్ లుక్ తో స్టైల్ గా కనిపిస్తాడట. మిస్టర్ పర్ ఫెక్ట్ అనే లైన్ కు తగ్గట్టుగా మరో షేడ్ చూపిస్తాడని సమాచారం. మరి ఇమేజ్ కు పూర్తి కాంట్రాస్ట్ గా చ్రై చేస్తోన్న బన్ని ఈ లారీ డ్రైవర్ లుక్ తో ఎలాంటి మేజిక్స్ చేస్తాడు అనేది చూడాలి. అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటాడు. రాబోయే కొత్త సినిమాలో న్యూ లుక్ తో అలరిస్తాడట.   

మరింత సమాచారం తెలుసుకోండి: