ఈ మధ్యకాలంలో హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్న  విషయం తెలిసిందే.. కొంతమంది హత్యలు చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి  పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు ఏదేమైనా... రోజురోజుకు పెరిగిపోతున్న అనుమానాస్పద మృతి లతో  మాత్రం పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. బ్యూటిషన్ గా పనిచేసే ఓ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందా హత్య చేశారా అని విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. 

 

 

 వివరాల్లోకి వెళితే అనుమానాస్పదంగా యువతి మరణించిన సంఘటన హైదరాబాద్లోని మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాద్రి నగర్ లో ఓ యువతి నివసిస్తోంది.ఇక ఆ యువతి బ్యూటీషియన్ గా అక్కడ పని చేస్తుంది. ఇక ఈ యువతి దగ్గరికి రోజు చాలామంది కస్టమర్లు వచ్చి పోతూ ఉంటారు. అయితే ఆ యువతి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 

 

 ఇక ఆ యువతికి సంబంధించి పలు వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. అయితే ఆ యువతి ని ఎవరైనా చంపి ఉంటారా.. చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయనీ  పోలీసులు తెలిపారు. లేదా యువతి ఆత్మహత్య చేసుకుని మరణించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక అనుమానాస్పదంగా మరణించిన యువతి కి సంబంధించి పలు వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: