సినిమా రంగం అనేది ఓ వింతైన రంగుల ప్రపంచం. ఇందులో తెర ముందు కనిపించే రంగుల వెనుక తెరవెనక కనపడని కథలు ఎన్నో నడుస్తూ ఉంటాయి. ఇలాంటి కథల్లో అందరికీ ఆసక్తి కలిగించే అంశం హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు. ఇవి ప్రస్తుత ఆధునిక యుగంలో పెరిగిన మీడియా ప్రభావంతో అందరికీ తెలిసి పోతున్న 1970 80 వ దశకంలో కూడా ఎక్కువగానే ఉండేవి. అయితే అప్పుడు ఇప్పుడు అంతా మీడియా ప్రభావం లేకపోవడంతో అవి చాలా వరకు పుకార్లు షికార్లు గానే మిగిలి పోయేవి. అప్పట్లో హీరోలు హీరోయిన్ల మధ్య ఎఫైర్ నడిచిన ఇప్పుడు బయటకు వచ్చి అంత వేగంగా లీక్ అయ్యేవి ఏవి కావు.

 

నాడు స్టార్ హీరో లాగా ఉన్న శోభన్ బాబు, కృష్ణ అలాంటి వారి నుంచి ఆ తర్వాత జనరేషన్ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి హీరోలు సైతం ఈ ఆఫర్ల గాసిప్పుల్లో చిక్కుకున్న వారే. ఇక నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ సైతం కెరీర్ ప్రారంభంలో లో అప్పట్లో సినిమాల్లోకి కొత్తగా వచ్చిన ఓ తమిళ హీరోయిన్ తో ఎఫైర్ కొనసాగించాడు అన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ హీరోయిన్ బాలయ్య పక్కన నటించకపోయినా అప్పట్లో తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆ హీరోయిన్ అక్కడ  అప్పుడు స్టార్ గా ఉన్న ఓ సీనియర్ హీరో వారసుడు తో ప్రేమాయణం నడిపింది అన్న వార్తలు కూడా వచ్చాయి. బాలయ్యకు దూరమయ్యాక తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో అక్కడ అ మరో హీరో తో ప్రేమాయణం నడిపిన ఆ హీరోయిన్ చివరకు ఓ దర్శకుడి ని పెళ్లి చేసుకొని కెరీర్ లో సెటిల్ అయింది. తమిళనాడులో ఒక హీరోయిన్‌ను అభిమానులు ఏకంగా దేవతగా ఆరాధించే వారు.

 

అయితే ఈ విషయంలో వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ ను తీవ్రంగా విభేదించిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సైతం బాలయ్య ఆ హీరోయిన్‌తో సాగించిన ఎఫైర్ గురించి మాట్లాడుతూ అది నిజమే అని బాలయ్య హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఎన్టీఆర్ ఆగమేఘాల మీద కాకినాడకు చెందిన వసుంధర తో బాలయ్య పెళ్లి జరిపించారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: