టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో నటరత్న ఎన్టీఆర్ ఎన్నో ఏళ్ళ పాటు సినిమా సీమని తిరుగులేని రారాజుగా ఏలారు. ఇక ఆ తరువాత వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కూడా అదే విధంగా కొన్నేళ్లపాటు టాప్ హీరోగా కొనసాగారు. ఇక ఆపై తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అయితే దాదాపుగా దశాబ్దానికి పైగా తిరుగులేని టాలీవుడ్ రారాజుగా ఇప్పటికీ కూడా అదే విధంగా క్రేజ్ తో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. అయితే మెగాస్టార్ తరువాత వచ్చిన తరం హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కూడా తమ సినిమా కెరీర్ ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నో గొప్ప విజయాలతో కోట్లాది మంది అభిమానులతో అద్భుతమైన పేరుని గడించారు. నిజానికి మెగాస్టార్ తరువాత మా తరంలో నెంబర్ వన్ అనేవారు ఎవరూ లేరని, అందరూ సమానమే అని, అయినా తనకు అటువంటి వాటిపై నమ్మకం లేదని మహేష్ పలు మార్లు చెప్పడం జరిగింది. అలానే పవర్ స్టార్ కూడా తనకు నెంబర్ వన్ స్థానం వంటి వాటిపై ఆసక్తి లేదని, అందరు హీరోలు కూడా సమానమే అని ఎన్నో మార్లు వ్యాఖ్యానించారు. 

 

అయితే మెగాస్టార్ తరువాత పక్కాగా వీరిద్దరిలో ఎవరు నెంబర్ వన్ అని చెప్పడం ఇప్పటివరకు కూడా వీలు కాలేదనే అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం పవన్, మహేష్ ఇద్దరికీ కూడా సమాన మార్కెట్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, అలానే ఒకరి సినిమా తరువాత మరొకరు రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగడం జరుగుతూ వస్తోందని, కాబట్టి చిరు తరువాత నెంబర్ వన్ స్థానంలో ఈ ఇద్దరు నటులు ఉంటారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే బయట వీరిద్దరూ కలిసి పెద్దగా కనపడనప్పటికీ, ఇద్దరికీ కూడా ఒకరిపై మరొకరికి ఎంతో మంచి సదభిప్రాయం ఉందని, చిరు ఫ్యామిలీ వేడుకలకు ఘట్టమనేని ఫ్యామిలీ, అలానే ఘట్టమనేని ఫ్యామిలీ వేడుకలకు చిరు ఫ్యామిలీ ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబుకు ఎంతో మంచి అభిప్రాయం ఉందనేది ఇప్పటికే పలు మార్లు వెల్లడైంది కూడా. 

 

గతంలో తాను హీరోగా నటించిన అర్జున్ సినిమా పైరసీ సమయంలో పవన్ కళ్యాణ్ అందించిన తోడ్పాటు ఎప్పటికీ మరువలేదని మహేష్ ఎప్పుడూ చెప్తుంటారు. అటు చరణ్, చిరుల తో పాటు ఇటు పవన్ కు కూడా మహేష్ మంచి అభిప్రాయం ఉందని వారి సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. ఇక ఒకానొక సందర్భంలో నాకు ఎంతో ఇష్టం అయిన వ్యక్తి పవన్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మహేష్, మెగా ఫ్యామిలీ అంటే తనకు ఎంతో అభిమానం మాత్రమే కాక వారితో ఎంతో మంచి అనుబంధం కూడా ఉందని అంటుంటారు. అలానే పవన్ కూడా మహేష్ నటించిన యువరాజు సినిమాకు క్లాప్ కొట్టారు, అలానే పలు సందర్భాల్లో మహేష్ విషయమై మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవారట పవన్. ఎంతైనా అటు పవన్, ఇటు మహేష్ ఇద్దరూ కూడా అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఒకరిపై మరొకరికి ఏమాత్రం పోటీ తత్వం లేకుండా మంచి అభిప్రాయం కలిగి ఉండడం ఎంతో గొప్ప  విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: