తెలుగులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పరిచయం చేసిన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. మంచు మనోజ్ హీరోగా ఝుమ్మంది నాదం సినిమా ద్వారా టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్, వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ తో నటించింది. కానీ ఈ బ్యూటీ అకౌంట్ లో పెద్దగా బ్లాక్ బస్టర్స్ పడింది లేదు. తెలుగులో క్రేజ్ మాత్రం సంపాదించుకోగలిగింది గాని క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకొని స్టార్ హీరోయిన్ మాత్రం అవలేకపోయింది. అదీ గాక తనని టాలీవుడ్ కి తీసుకువచ్చిన దర్శకేంద్రుడి మీదే సంచలనమైన వ్యాఖ్యలు చేసి బ్యాడ్ నేం తెచ్చుకుంది. దాంతో తెలుగు వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశారు.

 

అయితే తాప్సీ కి బాలీవుడ్ బాగా లిఫ్ట్ ఇచ్చింది. అక్కడ కమర్షియల్ చిత్రాలతో పాటు కథా బలం ఉన్న సినిమాలలోను నటించి బాగానే పాపులర్ అయింది. వాస్తవంగా తాప్సీకి తెలుగు కంటే హిందీ లోనే సూపర్ హిట్స్ ని దక్కించుకుంది. గ్లామర్ పాత్రలకి స్కిన్ షోక్ ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా అక్కడ వచ్చిన అవకాశాలని ఒడిసి పట్టుకుంది. వరుసగా హిట్స్ అందుకుంది. ఇక ఇక్కడ విచిత్రమేమిటంటే గ్లామర్ పాత్రలు పోషిస్తూ సై అంటున్నప్పటికి తాప్సీ కి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాలు, సామాజిక అంశంతో ముడిపడి ఉన్న పాత్రలు దక్కడం విశేషం.

 

ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో రెండు సినిమాలు చేసింది. బహుషా ఈ తరం హీరోయిన్స్ కి ఇలా వెంట వెంటనే బిగ్ బి తో ఛాన్స్ దక్కించుకోవడం ఒక్క తాప్సీకి మాత్రమే సాధ్యమైనట్టుంది. అయితే తాజాగా తాప్సీ కొన్ని విషయాలలో అతిగా టెన్షన్ పడుతుందట. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల విషయమై ఇంతకుముందెప్పుడు లేని విధంగా విమర్శలు వస్తున్నాయి. కరణ్ జోహార్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల జ్యూరీ సభ్యుడిగా ఉండటంతో ఆయన సినిమాలకు.. ఆయన సినిమాల్లో ప్రస్తుతం చేస్తున్న వారికే ఎక్కువ అవార్డులు వచ్చినట్లుగా రంగోలీతో పాటు మీడియాలో విమర్శలు వస్తున్నాయి. గల్లీ బాయ్ కు ఏకంగా 13 అవార్డులు రావడంతో ఈ విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.  

 

ఇక సాండ్ కీ ఆంఖ్ సినిమాలో పోషించిన పాత్రకు గాను ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డును తాప్సి దక్కించుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి వస్తున్న విమర్శల నేపథ్యంలో వివాదంలో నా పేరు రాకపోవడం సంతోషంగా ఉంది. నా అవార్డు ను జెన్యూన్ గా వచ్చిందని అంతా నమ్ముతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఈ విషయంలో అతిగా ఆలోచించి బాగా టెన్షన్ పడినట్ట్లు తాప్సీ తెలిపింది. ఇక ఈ విషయం కాకుండా ప్రస్తుతమున్న క్రేజ్ గనక ఒక్కసారిగా దూరమై సినిమా అవకాశలు తగ్గు ముఖం పడితే పరిస్థితి ఏంటి అని తాప్సీ గత కొన్ని రోజులుగా మదన పడుతుందట. ఈ పిచ్చి ఆలోచనలతోనే చిక్కి సగమైపోయిందట. అసలు మేకప్ లేకపోతే చాలా దారుణంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: