సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాఫీ తాగే సమయాన్ని కూడా వృధా చేయకుండా ఎవరినో ఒకరిని కదిలిస్తూ ఉంటాడు. ఎలాంటి వ్యక్తి అయినా వర్మకి అనవసరం అనాలనుకున్నది అనేస్తాడు. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. సినిమా వాళ్ళని, రాజకీయ నాయకులనే కాదు ప్రపంచ పటం లో ఆయన కంటికి కనిపించిన వాళ్ళెవరైనా సరే వర్మకి ఒకటే. సెటైర్స్ వేయడం లో వర్మకి అడుక్కునే వాడైనా, అమెరికా అధ్యక్షుడైనా సమనమే. అంటే దీన్ని బట్టి వర్మ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించి అందరికీ తెలిసిందే.

 

 ట్రంప్ ను ఇప్పటికే విమనాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ట్రంప్ పర్యటనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే ఆయనకి బాగా వచ్చిన భాషలో వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్ ని కార్నర్ చేస్తున్నాడు. 23 నుండే మన ఆర్జీవీ ట్రంప్ టార్గెట్ చేస్తూ ఆయన కోసం జనాల్ని పోగేసిన విషయంలో అలాగే.. ఈ పర్యటన పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయంలో వర్మ తన మార్క్ పంచ్ లు విసిరాడు. అంతేకాదు ఆర్జీవీ ఏమాత్రం జంకకుండా ట్రంప్ ని ఏకిపారేస్తున్నాడు. రీసెంట్ గా చేసిన ట్వీట్ లో వర్మ రెచ్చిపోయాడు. 'ట్రంప్ కు స్వాగతం పలికే సమయంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మన భాష అర్థం కాక ట్రంప్ బోర్ ఫీలవుతాడని.. ఆ సమయంలో ట్రంప్ ఎక్స్ ప్రెషన్ చూడాలి .. ఫెంటాస్టిక్ గా ఉంటుందని ఆర్జీవీ వెటకారంగా అన్నాడు. 

 

అంతేకాదు ట్రంప్ ఇండియాకి ఎందుకొస్తారో తెలుసా .. ఆయనని ఎంత మంది చూడటానికి వస్తారో ఇండియాలో తన క్రేజ్ ఏంటో తెలుసుకోవడానికే అని సెటైర్ వేశారు. అంతేకాదు ఇదే విషయాన్ని ట్రంప్ చనిపోయే వరకు ఇండియాలో అక్కడ ప్రజల్లో నాకు ఇంత క్రేజ్ ఉందని గొప్పగా చెప్పుకోవచ్చనే ఈ పర్యటన సాగుతోందని ఆర్జీవీ తన శైలిలో చెప్పుకొచ్చారు. ఇండియాలో నాకున్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదని అబద్ధం చెబుతాడు అంటూ వరుసగా ట్వీట్ లతో ఆర్జీవీ పంచ్ లు పేల్చాడు. ఇవే కాదు ఆర్జీవీ స్టైల్లో రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఈ ట్వీట్స్ చూసిన కొంతమంది ట్రంప్ కి గనక వర్మ ట్వీట్స్ అర్థమైతే మన తెలుగు వచ్చి ఉంటే అంటూ రీ ట్వీట్ చేసేవాడని కామెడీగా మాట్లాడుకుంటున్నారు. నిజమే కదా వర్మ ట్వీట్స్ మనకి అర్థమవుతాయిగాని డొనాల్డ్ ట్రంప్ కి కాదు కదా..!  

  

మరింత సమాచారం తెలుసుకోండి: