దర్శక రత్న దాసరి నారాయణ రావుగారి ప్రియ శిష్యుడు అత్యంత ఆప్తులు కోడి రామకృష్ణ. దాదాపు పదేళ్ళ పాటు దాసరి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి దాసరి గారికి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత కె.రాఘవ గారే కోడి రామకృష్ణ గారికి మొదటి అవకాశం ఇచ్చేలా చేసుకున్న గొప్ప దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన మొదట తీయాలనుకున్న సినిమా తరంగిణి. కానీ ఆ సినిమా కథ విషయంలో నిర్మాతకి కొన్ని సందేహాలు తలెత్తడంతో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి గారు హీరోగా నటించారు. 

 

కోడి రామకృష్ణ మొదటి సినిమా హీరో చిరంజీవి గారు కావడం విశేషమైతే ఈ సినిమా 500 రోజులకి పైగా ఆడటం గొప్ప విశేషం. అంతేకాదు మళ్ళీ ఇప్పటి వరకు చిరంజీవి గారి ఏ సినిమా ఇన్ని రోజులు ఆడింది లేదు. ఇక ముందు అనుకున్న కథ తోనే తరంగిణి సినిమాని తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఈ సినిమా కూడా 500 రోజులకిపైగా ప్రదర్శింపబడి రికార్డ్ సృష్ఠించింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలని తీశారు. అంతేకాదు ఇండస్ట్రీలో శత చిత్రాల దర్శకుడు అన్న పేరుని సంపాదించుకున్నారు. ఇక కోడి రామకృష్ణ గారి గురువు గారు దాసరి గారికైనా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయోమో గాని కోడి రామకృష్ణ కి మాత్రం అంతగా ఫ్లాప్ సినిమాలు లేవని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం.

 

ఇక కోడి రామకృష్ణ అనుష్క తో తీసిన అరుంధతి సినిమానే ఆయన జీవితంలో ఆఖరి సూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత ఆన కాళ్ళకి పక్షవాతం రావడం తో చాలా రోజులు మంచానికే పరిమితయ్యారు. 100 కి పైగా సూపర్ హిట్ సినిమాలు తీసిన కోడి రామకృష్ణ ఆఖరి రోజుల్లో మాత్రం నరకం అనుభవించారు. ఒక మనిషి సహాయం ఉంటేనే అడుగులు వేయగలిగే పరిస్థితికి వచ్చారు. ఆయన కాళ్ళకి ట్రీట్మెంట్ కోసం కేవలం ఇంజెక్షన్స్ కే దాదాపు 2 లక్షలు ఖర్చు చేశారు. నెమ్మదిగా నడవగలిగే శక్తి రాగానే మళ్ళి తన గదిలో కూర్చొని కథలు రాయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆయన చనిపోయో సమయమలో కూడా ఒక సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతుండటం ఆసక్తికరమైన విషయం. ఆయన ఫ్యూచర్ ప్రాకెక్ట్స్ గా అనుష్క తో అలాగే చిరంజీవి గారితో సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: