చైనాలోని వూహాన్ సిటీ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు రెండు వేలకు మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. అంటు వ్యాధి గాలి ద్వారా వేగంగా వ్యాపించడం వల్ల దాని ద్వారా బాధితులు చాలా ఎక్కువ మంది అవుతున్నారు. ఇప్పటికే 70 వేల మందికి పైగా వ్యాధి సోకగా దాని వల్ల చైనాలో మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని సరిగ్గా సంసారాలు కూడా ఎవరూ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

 

ఇప్పటికే కొన్ని దేశాలలో కనీసం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న జనాలు ఇప్పుడు కనీసం ప్రియురాలికి ప్రేమతో ఒక ముద్దు పెట్టుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి తయారైంది. చైనా తో సహా చాలా విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఆప్యాయత కలిగినప్పుడు ముద్దులు పెట్టుకోవడం హగ్గులు ఇచ్చుకోవడం చాలా కామన్. కానీ తాజాగా కరోనా ఎఫెక్ట్ తో చైనా పక్కనే ఉండే ఫిలిప్పెన్స్ సముద్ర తీరం లోని బాకొలాడ్ నగరంలోని పెళ్లి జంటలకు ఎంతో కష్టం వచ్చి పడింది.

 

అక్కడి ప్రభుత్వం తాజాగా 220 జంటలకు గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేయగా పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు తెల్లటి దుస్తులలో మెరిసి పోయారు. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులతో పెళ్లి పీటల మీదకి వచ్చారు. ఇక విదేశాల్లో పెళ్లి అయిపోయిన తర్వాత ముద్దు పెట్టుకోవడం చాలా కామన్. అది కూడా వారు ఆఖరికి పాపం మాస్కుల పైనే పెట్టుకున్నారు.

 

తమ జీవిత భాగస్వామికి కరోనా వ్యాధి లేకపోయినా చుట్టూ అంత మంది జనం ఉన్నారు కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకొని వారి ముఖానికి మాస్కు లు వేసుకొని పెళ్లి చేసుకుని ముద్దులు కూడా అలానే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అపురూపంగా వారి జీవిత భాగస్వామిని ముద్దు పెట్టుకుందామని ఆశపడ్డ అక్కడివారంతా ఛీ…! ఇదేమి తలరాత అంటూ బాధ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: