ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) చైనాలోని వూహాన్ నగరంలో పుట్టడం వల్ల ఇప్పటికే మూడు వేల మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అలాగే దాదాపు 80 వేల మంది వైరస్ బారినపడి బాధపడుతున్నారు. అది కాకుండా మృతుల్లో 95 శాతానికి పైగా చైనా ఉన్నారు. ఇక మిగిలిన ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్న వైరస్ చైనాలోని ఒక ప్రయోగశాలలో నుండి మొదలైనట్లు ఇప్పుడిప్పుడే కొన్ని ఆధారాలు బయటికి వస్తున్నాయి.

 

ఇదే అనుమానంతో సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు 'పాజిబుల్ ఆరిజిన్స్ ఆఫ్ 2019 ఎన్సీవోవీ కరోనా వైరస్' పేరుతో ఒక వ్యాసం రాశారు. ఇంతకీ దానిలో ఏముందంటే చైనాలోని 'వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లో' గత కొంతకాలంగా గబ్బిలాల పై పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ కు కేంద్రస్థానంగా ప్రస్తుతం చైనా చే చెప్పబడుతున్న వూహాన్ సి ఫుడ్ మార్కెట్ కేవలం పరిశోధన కేంద్రానికి 300 గజాల దూరంలో ఉంది. అయితే ఒకరోజు కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడి పై దాడి చేశాయని.. వారి రక్తం అతనిపై పడిన తర్వాత అతని నుంచి అందరికీ వైరస్ పాకి ఉంటుందని చాలామంది అనుమానిస్తున్నారు.

 

అయితే ఇక్కడ అందరికీ అనుమానాన్ని రేకెతిస్తున్న అసలు విషయం ఏమిటంటే గబ్బిలం యొక్క రక్తం మరియు మూత్రం అతనిపై పడిన తర్వాత అతను రెండు వారాల పాటు స్వయంగా క్వారంటైన్ లో ఉన్నాడని తెలిపారు. మరి ఎంత జాగ్రత్త తీసుకుంటే అసలు ల్యాబ్ నుండి వైరస్ బయటకు ఎలా వెళ్ళింది? ఎవరైనా కావాలనే కుట్రపూరితంగా జనాభా ఎక్కువగా ఉండే సి ఫుడ్ మార్కెట్ లోనికి దానిని వదిలి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు.

 

ఏదేమైనా అనుకోకుండా వైరస్ వ్యాప్తి చెందడం కంటే ల్యాబ్ నుండి ఉత్పత్తి అయింది అన్న విషయమే చాలా సబబుగా ఉందని నిపుణుల మాట. కానీ చైనా మాత్రం ఇదేమీ కాదు అని అనేక వేషాలు వేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఎవరో లాబ్ వ్యక్తులే కావాలని గబ్బిలాల నుండి వైరస్ ను తీసి కుట్రపూరితంగా వ్యహరించిన అవకాశాలను కొట్టిపారేయలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: