ఎన్నో నెలల నుండి టాప్ రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్ ఏమైనా ఉంది అంటే అది వంటలక్క సీరియల్ కార్తీకదీపం ఏ.. రోజుకో ట్విస్ట్ తో... అప్పుడప్పు అతి ప్రేమలతో కొనసాగుతున్న ఈ సీరియల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటి అంటే ? ఈ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న నల్ల దీప.. అదేనండీ వంటలక్క ప్లేస్ లో మరొకరిని తీసుకొస్తున్నట్టు వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. 

 

అవును.. మీరు విన్నది నిజమే. వంటలక్క ప్లేస్ లో మరొకరిని తీసుకురావాలని ఆ సీరియల్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట.. కారణం ఆమె నటన బాగోలేకనో.. లేక మరేదైనా కారణమో కాదట.. నిజానికి ఆమె వల్లే సీరియల్ ఇప్పటికి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటూ ఉండటం వల్ల.. ఆమె భర్త కార్తీక్ ఆమెను అనుమానించి దూరం పెట్టినప్పుడు ఆమె వేడుకున్న తీరు అంత చూసి జనాలకు కూడా కన్నీళ్లు వచ్చేశాయి.. ఇక అప్పటి నుండి ఈ డాక్టర్ బాబు.. వంటలక్కతో ఎప్పుడు కలుస్తాడు అని ఎదురు చూస్తున్నారు. 

 

అలాంటి ఈ సమయంలో.. వంటలక్కను మార్చాలి అనుకుంటున్నారట సీరియల్ నిర్వాహకులు. అలా మార్చాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే.. దానికి కారణం వంటలక్కే అంట.. సీరియల్ ప్రారంభ సమయంలో ఓ మాదిరి రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న నిర్వాహకులు.. సీరియల్ సూపర్ హిట్ అయ్యేసరికి ఆ రెమ్యూనరేషన్ కు మించి పెంచుకుంటూ వచ్చారట.. అలా పెంచుకుంటూ ఇప్పుడు సీరియల్ స్టార్టింగ్ లో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే 4 రేట్లు ఎక్కువ ఇస్తున్నారట. 

 

అయినప్పటికీ వంటలక్క రెమ్యూనరేషన్ పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారట.. ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడం.. అలా హిట్ అయ్యాక వంటలక్కకు జాతీయస్థాయి నుండి ఆఫర్లు రావడం వల్లే ఆమె డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు కొందరు.. అందుకే ఇక రెమ్యూనరేషన్ పెంచలేక ఆమెను తీసేసి మరొకరిని పెట్టాలని అనుకుంటున్నారట.. మరి ఈ నల్ల దీప ప్లేస్ లో ఇంకొకరు వస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: