మళయాళ సినిమా ప్రేమం లో మలార్ పాత్రతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన ఓ టీజర్ అలరించింది. సహజ నటికి పెట్టింది పేరుగా సాయి పల్లవి తను చేసే పాత్రలో ఇన్వాల్వ్ అవుతుంది. 

 

అదెలా సాధ్యమవుతుందని ఆమెని అడిగితే.. కథ విన్నప్పుడే ఆ పాత్రలో తనని తాను ఊహించుకుంటా.. కథే తన పనిని సగం పూర్తి చేస్తుందని. ఇక సినిమా మొదలై సెట్స్ లోకి వెళ్లినప్పుడు తను ఆ పాత్రలా మారిపోతా అంటుంది సాయి పల్లవి. తాను నటించడానికి స్కోప్ ఉన్న సినిమాలనే ఒప్పుకుంటా అలా అనిపించని చాలా సినిమాలు వదులుకున్నా అన్నది అమ్మడు. అంటే అందులో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయన్న్నమాట. చూస్తుంటే సాయి పల్లవి చేసిన సినిమాల కన్నా వదులుకున్న సినిమాల లిస్టే చాలా పెద్దదని చెప్పొచ్చు.

 

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో మరోసారి తానేంటో ప్రూవ్ చేస్తానని చెబుతుంది సాయి పల్లవి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి సెలెక్టెడ్ సినిమాలనే చేస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఫిదా తరహాలో మరోసారి శేఖర్ కమ్ముల సాయి పల్లవితో హిట్ కొడతాడని అంటున్నారు. ఇప్పుడు మంచి ఫాం లో ఉన్న నాగ చైతన్య కూడా ఈ సినిమాతో అలరిస్తాడని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్లు కొట్టిన చైతు ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: