స్మాల్ స్క్రీన్ పై తన స్కిల్స్ తో ఆకట్టుకుంటున్న సుడిగాలి సుధీర్ అక్కడ కొద్దిగా క్రేజ్ వచ్చే సరికి తాను హీరో కటౌట్ అని బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తనకు ఉన్న ఈ బుల్లితెర ఫాలోయింగ్ చూసి తనకు తిరుగులేదని.. హీరోగా చేయడమే లేటని ఫిక్స్ అయ్యాడు. అలా చేసిన ప్రయత్నమే సాఫ్ట్ వేర్ సుధీర్. తనకున్న కామెడీ టైమింగ్ తో అటెంప్ట్ చేయకుండా ఓ కమర్షియల్ హీరో రేంజ్ లో దిగాడు సుధీర్. అందుకే జనాలెవరు పెద్దగా పట్టించుకోలేదు.

 

ఎందుకంటే అందులో వాళ్లకు తెలిసిన సుధీర్ కనబడలేదు. అందుకే సినిమాను ఎవరు చూడలేదు. ఇక రెండో ప్రయత్నంగా 3 మంకీస్ అని సుధీర్ అండ్ జబర్దస్త్ టీం అందరు కలిసి చేశారు. అది కూడా తుస్సుమన్నది. సో హీరో, హీరో అని చెప్పుకునేంత ఈజీ కాదు హీరోగా సక్సెస్ అవడం. ముందు తనకు ఉన్న ఈ ఇమేజ్ తో ఎలాంటి కథ చేస్తే బెటర్ అన్న డెశిషన్ మేకింగ్ తెలియాలి అప్పుడే హీరోగా సక్సెస్ అవుతారు. ఇదే తరహాలో యాంకర్ ప్రదీప్ కూడా హీరోగా చేస్తూ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేస్తున్నాడు.  

  

ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే సినిమాకు రిలీజ్ ముందే సూపర్ బజ్ ఏర్పడింది. ప్రదీప్ చేసినట్టుగా తన సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు సుధీర్. అందుకే ఇక మీదట హీరోగా సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. స్నేహితులు ఎవరైనా చెప్పినా సరే మళ్లీ కొన్నాళ్ల పాటు హీరో అన్న ఆలోచన మానుకుంటానని అంటునాడట. రెండు సినిమాలకే సుధీర్ చేతులెత్తేశాడన్నమాట. మరి మనోడిని కదిలించే కథ దొరికే వరకు హీరో అన్న ఆలోచనని మానుకుంటాడట. సుదీర్ ను చూసి పాపం అనేస్తున్నారు అతని సన్నిహితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: