‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్ 2’ సినిమాల సూపర్ సక్సస్ తరువాత హీరోయిన్ మెహరిన్ కు చాల అవకాశాలు వస్తాయని అందరు భావించారు. అయితే ప్రస్తుతం ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితి ఆమెకు ఏర్పడడానికి గల కారణం ఆమె వింత ప్రవర్తన అన్న గాసిప్పులు ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి. 


65 లక్షలు పారితోషికం కావాలి అని డిమాండ్ చేసే ఈ యంగ్ హీరోయిన్ ఖర్చులు వింటే ఎవరైనా షాక్ అవుతారు. ఈమె ఒక్క పూట ఫుడ్ బిల్లు 7,500 అట. అదేవిధంగా ఈమెకు సంబంధించి ఒక్క రోజు లాండ్రీ బిల్లు 27,000 అట. ఈమె సొంత కాస్ట్యూమ్ డిజైనర్ బిల్లు అయిదు లక్షల నలభై వేలు అయితే ఈమె హీరోయిన్ గా నటించే సినిమా షూటింగ్ కోసం ఈమెకు ఇచ్చిన హోటల్ లో పక్క గది తన  కాస్ట్యూమ్ డిజైనర్ కు కావాలని డిమాండ్ చేస్తుందట.

 

ఈమె లేటెస్ట్ గా నటించిన ‘అశ్వద్ధామ’ సినిమాకు సంబంధించి ఈమె హోటల్ బిల్స్ చెల్లించలేక నిర్మాతలు తల పట్టుకుంటున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించి ఆమెకు ఇవ్వవలసిన పారితోషికం ‘ఆశ్వద్దామ’ నిర్మాతలు పార్క్ హయాత్ హోటల్ లో ఈమె ఖర్చుపెట్టిన ఖర్చులు చూసి కొంత పారితోషికం చెల్లించకుండా ఆపుచేస్తే మెహరిన్ కోపంతో ‘అశ్వద్దామ’ మూవీకి సంబంధించిన కొన్ని ప్రమోషన్ కార్యక్రమాలు ఎగ్గొట్టి నాగశౌర్య కు కూడ చెప్పకుండా వెళ్ళి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈ వార్తలను మెహరిన్ వ్యక్తిగత సహాయకులు ఖండిస్తూ ఆమె పై నెగిటివ్ ప్రచారం చేయడానికి ఎవరో కావాలని ఇలాంటి గాసిప్పులు సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు సూపర్ హిట్లు వచ్చి కూడ ఆమె ఇండస్ట్రీలో నిలబడ లేకపోవడం వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: