మన దగ్గర ఒక అమ్మాయి హీరోయిన్ గా అవకాశాలు పొందాలంటే నిర్మాతలకి ముందు ఆ విషయంలో సహకరించాలని ఇప్పటికే చాలా మంది ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్ అంటూ చాలా మంది ఈ మధ్య రచ్చ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారని చాలా మంది నటీమణులు అంటున్నారు కూడా. ఏ అమ్మాయైయినా నిర్మాతకి కమిట్ మెంట్ ఇస్తేనే తన సినిమాలో అవకాశం ఇస్తాడు. లేదంటే ఏవో కారణాలు చెప్పి ఒకే చేసిన ప్రాజెక్ట్ నుండి కూడా తపిస్తాడని హీరోయిన్ గా చేస్తున్నవాళ్ళు కూడా బయట పెట్టిన సంగతి తెలిసిందే.

 

ఈ విషయాన్ని కొంతమంది బయటకి చెప్పుకోవాలంటే సిగ్గు విడిచి చెప్పుకోలేక .. చెప్పినప్పటినుంచి సమాజంలో, జనాలలో ఎదురయ్యో చులకనైన చూపులను తట్టుకోలేక ఏమీ ఎరగనట్టు ఏమీ జరగనట్టు నెట్టుకెళ్ళి పోతున్నారు. ఇక ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు ఇలాంటి విషయాలకి ఒప్పుకోరు కాబట్టే సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావని, ఇవ్వరని ఒక అపవాదు ఉంది. కొన్ని పరిణామాలు చూస్తుంటే నిజమేనని నమ్మక తప్పదు. అందుకే మన దర్శక, నిర్మాతలు ముంబై నుండి మోడల్స్ ని దిగుమతి చేసుకొని వాళ్ళకి సకల సౌకర్యాలు సమకూర్చి స్టార్ హీరోయిన్ ని చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా ఈ మధ్య ఇండస్టీలో 'నన్ను వాడుకునే అవకాశం ఇచ్చారు' అని బయట పడుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటివి ఎదురయ్యాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మన దగ్గర ఇపుడు ఒక స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ముంబై ముద్దు గుమ్మ తనకి అవకాశం ఇస్తానన్న స్టార్ ప్రొడ్యూసర్ తననుంచి అది ఎక్స్పెక్ట్ చేసి ఇన్‌డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగాడని బయటపెట్టింది. ఆయన ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ ....'సెక్స్ మనసుకి సంబంధించింది .. శరీరానికి కాదు నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా' ..అంటూ సినిమాటిక్ గా సినిమా ఆఫర్ చేశాడట. ఆసమయంలో తనకి సినిమాలో చేయడం తప ఇంకేది అనిపించలేదని కొన్నిటికి మనసు చంపుకోవాల్సిందేనని వెల్లడించింది. అంటే ఏం జరిగిందో అర్థమై వుంటుంది కదా. ఆమే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గాయి అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: