సినిమా వాళ్ల బంధాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి అనుకోకుండా కలిసిన కొన్ని పరిచయాలు చాలా దూరం వెళతాయి. కొన్నిసార్లు ఎంతో కాలం కలిసున్న పరిచయాలు కూడా ఒక్కసారిగా కట్‌ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో పీటల వరకు వచ్చిన పెళ్లిల్లు కూడ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.

 

నటి త్రిష పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తనకు కాబోయే భర్త, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌ వద్ద... పెళ్లి అయిన తర్వాత కూడా నటిస్తానని చాలా గట్టిగానే చెప్పిందట. కానీ పెళ్ళికి ముందు ఓకే కానీ పెళ్లి తర్వాత మాత్రం కుదరదని వరుడు, అత్తింటివారు కరాఖండిగా, ఓ దశలో వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పడంతో నటనని వదులుకోవడం ఇష్టం లేని త్రిష ఏకంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంది.

 

దీనిపై త్రిష స్పందిస్తూ తనకు నటన అంటే అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం. గతంలో చాలా సందర్భాల్లో  జీవితాంతం నటిస్తూనే ఉంటా అని చెప్పింది త్రిష. `నేను సినిమాలకు దూరంగా ఉండలేను. నా నటనకు అభ్యంతరం చెప్పని వాడు ఎదురైనప్పుడు అతడ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని` క్లారిటీ ఇచ్చేసింది త్రిష. పెళ్లి ఆగిపోయిన తరువాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల మీద దృష్టి పెట్టింది.

 

గతంలో గ్లామరస్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తోంది. తనతో పాటు వచ్చిన వచ్చిన నయనతార, అనుష్కలు సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సాధిచటంతో తాను కూడా అదే రేంజ్‌ అందుకునే ప్రయత్నంలో ఉంది. త్రిష, ప్రస్తుతం పరమపథం విలయట్టు, గర్జనై, రాంగీ, సుగర్‌, రామ్‌, చిరు 152, పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: