వివాదాలకు సంచలన వార్తలకు చాల దూరంగా ఉంటాడు రాజమౌళి. అలాంటి వ్యక్తి పై ఎవరైనా కేసులు పెట్టారు అంటూ ఒకవిషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే అది పెద్ద న్యూస్ అవుతుంది. అయితే ఇలాంటి సంఘటన మొన్న జరిగింది. నాని నిర్మాతగా తీస్తున్న ‘హిట్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ సుమ కొద్ది సేపు తన సమయస్పూర్తి తో ఆ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన రాజమౌళి తో ఒక ఆట ఆడుకుంది.


ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ గురించి రాజమౌళి నోటి వెంట క్లారిటీ చెప్పించడానికి ప్రయత్నిస్తూ సుమ జక్కన్న పై కొందరు కేసులు వేస్తున్నారు అంటూ ఒక ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా బాగా లేటవడంతో కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్ల భార్యలు రాజమౌళిపై కేసులు పెట్టారని సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారని వారంతా అడుగుతున్నారని సుమ రాజమౌళిని ప్రశ్నించింది,


ఈ అనుకోని ప్రశ్నకు కొద్దిగా షాక్ అయిన రాజమౌళి దీనికి హీరోల పేర్లు కూడా జతచేస్తూ రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు కేసులు పెట్టలేదా అంటూ సుమను కార్నర్ చేసాడు. దీనితో సుమ మరింత రెచ్చిపోయి మా హీరోలను మీ దగ్గర పెట్టుకున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆందోళనలో అందరు ఉన్నారు అంటూ సుమ మరో ట్విస్ట్ ఇచ్చింది. 


రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ 2021 జనవరి 8న విడుదల ఖాయం అంటూ అతడి నోటి వెంట మాటలు వచ్చే వరకు ఈ జోక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటన ఇప్పటికే అధికారికంగా వచ్చినా సుమ తెలివిగా రాజమౌళి చేత మరొకసారి ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ ను బయటపెట్టించింది అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు సుమ రాజమౌళి ల మధ్య జరిగిన సంభాషణలను ఎంజాయ్ చేసారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: