ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయితే.. అది ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగుతుంది. దానికి సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఫెయిల్యూర్ అయిన వాటి సంగతి గురించి ప్రస్థావిస్తే.. అలానే ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో డెబ్యూ మూవీలో కలిసి నటించిన హీరోయిన్ తో ప్రేమ పాఠాలు నేర్చుకున్నాడు. ఇద్దరిది హిట్ పెయిర్ అయ్యే సరికి మరో సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఇక వీళ్లిద్దారు రెచ్చిపోయారు.

 

ఏకంగా ఆ స్టార్ లెగసీ ఉన్న హీరో వెళ్లి వాళ్ల ఇంట్లోనే ఆమెతో పెళ్లి ప్రపోజల్ చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే వాళ్లు అతన్ని కెరియర్ మీద దృష్టి పెట్టమని చెప్పి ఆ అమ్మాయి నీకు సెట్ అవదని చెప్పేశారు. అయితే అలా హీరో దూరమయ్యాడన్న డిప్రెషనో.. లేక మరేదో కాని స్టార్ అవ్వాల్సిన ఆ హీరోయిన్ కు అవకాశాలు రాలేదు. ఆమె కూడా వచ్చిన ఒకటి రెండు మంచి ఛాన్సులను అప్పుడున్న మాన్సిక స్థితిలో చేయలేక నో చెప్పింది. తనతో ఎంట్రీ ఇచ్చిన ఓ హీరోయిన్ స్టార్ గా ఎదిగినా ఈ అమ్మడు మాత్రం కెరియర్ లో వెనుకపడ్డది.

 

తన కెరియర్ నాశనమవ్వడానికి ఆ మెగా హీరోనే కారణమని అందరు అంటున్నా ఆ విషయాల్ని మాత్రం హైలెట్ చేయకుండా నిజాన్ని గ్రహించి సైలెంట్ గా తనకు వచ్చిన ఛాన్సులు చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఆ హీరో కూడా కొన్నాళ్లు బాధపడ్డా మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని ఈ హీరో లాస్ట్ ఇయర్ రెండు వరుస హిట్లతో మళ్లీ ఫాం లోకి వచ్చాడు. సో అలా హీరో, హీరోయిన్ లవ్ కాస్త డిజాస్టర్ గా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: