బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ప్రియాంకా చోప్రా ఒకరు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొంత కాలానికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా. ఇప్పటికి ఆమె స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతూ వస్తుంది. హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది దీపిక. ఎక్కువ పారితోషకం అందుకోవడం తో పాటుగా ఎక్కువ సంపాదన ఉన్న హీరోయిన్ గా దీపిక ఉంది. ఇక ఆమె ఎంత పాపులర్ అయిందో... ఆమె ప్రేమ కథలు కూడా అదే రేంజ్ లో పాపులర్ అయ్యాయి. మోడలింగ్ చేసే రోజుల నుంచి ఆమె ప్రేమ కథలు మొదలుపెట్టింది. 

 

మోడలింగ్ చేసే రోజుల్లో అసీం మర్చెంట్ అనే వ్యక్తితో ప్రియాంకా లవ్ స్టొరీ మొదలుపెట్టింది. అతనితో కొంత కాలం బాగానే ఉన్నా భేదాభిప్రాయాలు రావడంతో ఆమె విడిపోయి... హర్మాన్ బవేజా అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత స్టార్ హీరో షాహిద్ కపూర్ తో కూడా ప్రేమాయణం నడిపింది. ఈ ప్రేమ కథ అప్పట్లో బాలీవుడ్ లో హైలెట్ గా నిలిచింది. దీని గురించి ఎన్నో చర్చలు జరిగేవి. ఇక ఆ తర్వాత అక్షయ్ కుమార్ కి పెళ్లి అయినా సరే ఆయనతో ప్రేమాయణం నడిపింది. దీనిపై విమర్శలు వచ్చేవి. 

 

ఆ తర్వాత స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో కూడా ప్రియాంక అఫైర్ నడిపింది. ఈ వ్యవహారం షారుఖ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది అంటారు. ఆ వెంటనే టామ్ హిడిల్ స్టన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. పెళ్లి చేసుకుంటారు అని భావించారు అందరూ. కాని అనూహ్యంగా హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ నిక్ జోనాస్ అనే స్టార్ ని ప్రేమించి వెంటనే పెళ్లి చేసుకుంది. అతను ఆమె కంటే వయసులో పదేళ్ళ చిన్న వాడు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా ప్రియాంక ముందుకి వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: