బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐశ్వర్య అందం కోసం, సల్మాన్ ఖాన్ నటన తో పాటుగా అతని డాన్స్ కోసం ఎందరో అభిమానులు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారు. ఐశ్వర్య కెరీర్ లో సల్మాన్ ఖాన్ తో ఎన్నో సినిమాలు చేసింది. వాటిల్లో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళ మధ్య ప్రేమాయణం కూడా నడిచింది. అప్పట్లో బాలీవుడ్ లో ఈ లవ్ స్టోరీ ఒక సంచలనం. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అని భావించారు అందరూ. 

 

అయితే అనూహ్యంగా ఏమైందో ఏమో ఆమె వివేక్ ఒబెరాయ్ తో ప్రేమలో పడింది. అప్పుడు అప్పుడే బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న వివేక్ కి ఆమెతో ప్రేమాయణం ఉండటంతో చాలా మంది షాక్ అయ్యారు. అసలు దీని గురించి తెలుసుకోవడానికి బాలీవుడ్ మీడియా తో పాటుగా హిందీ మీడియా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగా సంచలన విషయం బయటపడింది. ఆమెను సల్మాన్ ఖాన్ శారీరకంగా మానసికంగా హింసించడంతోనే ఆమె సల్మాన్ తో ఉండలేకపోయింది అని తెలిసింది. 

 

దీనితో సల్మాన్ పెడుతున్న టార్చర్ ని ఆమె వివేక్ ఒబెరాయ్ తో పంచుకుంది అంటారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహమే ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయితే ఆ తర్వాత సల్మాన్ ఖాన్ వివేక్ ఒబెరాయ్ ని కెరీర్ పరంగా దేబ్బకోట్టాడు. తనకు ఐష్ దూరం కావడానికి వివేక్ ఏ కారణమని గుర్తించిన సల్మాన్ ఖాన్ ఇక అప్పటి నుంచి అతన్ని టార్గెట్ చేసాడు. దీనితో స్టార్ హీరో అయ్యే అవకాశం ఉన్నా సరే వివేక్ ఒబెరాయ్ కెరీర్ ఆగిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకోవడం కూడా హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: