బాలీవుడ్ లో కొన్ని కొన్ని ప్రేమ కథలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇవాళ సాయంత్రం కలిసి కార్యక్రమానికి వచ్చిన హీరో హీరోయిన్లు, లేదా ప్రేమికులు రేపు మధ్యాహ్నం ఇంకొకరి తో లంచ్ లో కనపడతారు. వాళ్ళ మధ్య ఎం ఉంటుందో ఏమో గాని మీడియా మాత్రం ఎక్కువగా వాళ్ళను ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా మీడియా ఆగదు. వాళ్ళు కూడా రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నమూ చేయరు. కొన్ని కొన్ని ప్రేమ కథలు వివాదాలకు కూడా దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.

 

వాటిల్లో ఒకటి కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, దీపిక పదుకొనే లవ్ స్టోరీ. ఈ త్రికోణ ప్రేమ కథ గురించి అప్పట్లో జాతీయ మీడియా ఎన్నో కథనాలు రాసింది. దీపిక తో ప్రేమాయణం నడుపుతున్న రణబీర్ కపూర్ ఆమెతో కలిసి పలు హిట్ సినిమాలు చేసాడు. దీనితో ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే భావించారు అందరూ. కాని ఆమె మాత్రం చేసుకోలేదు. ఇద్దరు విడిపోయారు. దీనికి కారణం... ఈ ప్రేమ కథలోకి కత్రీనా కైఫ్ ఎంటర్ అవ్వడమే. కత్రీనా సల్మాన్ తో విడిపోయిన తర్వాత రణబీర్ తో ప్రేమాయణం మొదలుపెట్టింది. 

 

అయితే ఇదంతా రణబీర్ దీపిక తో ఉన్నప్పుడే జరిగింది. దీని గురించి దీపిక, రణబీర్ మధ్య ఒక సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ కూడా అయిందని అంటూ ఉంటారు. అయితే ఆమె అనూహ్యంగా మరొకరితో ప్రేమలో పడటంతో ఈ వివాద౦ ముగిసింది. అప్పట్లో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లే. మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళే. తన సినిమాల కంటే రణబీర్ కపూర్ వీటి తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. అతనికి క్రేజ్ కూడా ఇలాగే ఎక్కువగా వచ్చింది. రణబీర్ తర్వాత దీపిక ఎన్నో లవ్ స్టోరీస్ నడిపింది. ఇప్పుడు రణవీర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: