ఈ టైటిల్ చూసి సినిమా రికార్డులు.. స్టార్ స్టామినా ఇలా ఏవేవో లెక్కల్లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ.. ఒక హీరో నెలకొల్పిన రికార్డులను మరో హీరో బద్ధలు కొట్టాల్సిందే. అది మెగా హీరో అయినా మరో హీరో అయినా.. ఈమధ్య మెగా హీరోల్లో ఇమేజ్ ఇష్యూస్ వచ్చాయని టాక్. ముఖ్యంగా బన్ని, చరణ్ ఇద్దరిలో ఎవరు తోపు అన్నది బాగా హడావిడి చేశారు. మెగా కాంపౌండ్ నుండి దూరంగా వచ్చి అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ప్రయత్నిస్తున్నాడు. 

 

ఇక రాం చరణ్ విషయానికి వస్తే తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా స్టార్ లెగసీని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న చరణ్సినిమా పూర్తి చేశాక మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ చరణ్ ప్లేస్ లో బన్ని ఆక్యుపై చేసింది రికార్డుల్లో కాదు.. సినిమా అవకాశాల్లో. కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో యంగ్ ఏజ్ రోల్ లో రాం చరణ్ నటిస్తాడని ముందు అనుకున్నా ఆ పాత్రకు ఇప్పుడు బన్నిని తీసుకోవాలని అనుకుంటున్నారట.

 

ట్రిపుల్ ఆర్ అయ్యేంత వరకు చరణ్, ఎన్.టి.ఆర్ వేరే సినిమాలు చేసే అవకాశం లేదు. అందుకే బన్ని అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. ఆల్రెడీ అల్లు అర్జున్, రాం చరణ్ ఇద్దరు కలిసి ఎవడు సినిమా చేశారు. ఇద్దరు ఒకేసారి స్క్రీన్ పై కనిపించరు కాని ఒకే టికెట్ కు రెండు సినిమాలు చూశారు. ఇప్పుడు అదే మరోసారి రిపీట్ అవుతుంది. చిరు సినిమాలో అల్లు అర్జున్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడట. మరి మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. ఈమధ్యనే ఆ సినిమా నుండి లీక్ అయిన చిరు లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక బన్ని కూడా ఉంటే  సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: