అక్కినేని కోడలుగా మారినా సమంత తన నటనకు స్వస్తి పలకలేదు. ఆమె ఇంకా వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. అవకాశాలు వస్తే ఇప్పటికీ టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి తాను రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతూ ఉండగానే సమంత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 


లేటెస్ట్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఈమె ఒక ‘డే కేర్’ సెంటర్ ను ప్రారంభించింది. అత్యాధునికమైన సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబడ్డ ఈ డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం ఈమధ్య జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మీడియా ప్రతినిధులతో పాటు సమంతతో సన్నిహితంగా ఉండే అనేకమంది ప్రముఖులను కూడ పిలవడం జరిగింది. 


ఈ డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన వీరంతా సమంత సమర్ధత గురించి బిజినెస్ ఉమెన్ గా రాణించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆమె పై ప్రశంసలు కురిపిస్తూ మధ్యలో ఆమెను ఇరుకున పెట్టే కొన్ని ప్రశ్నలు వేయడంతో ఆమె చికాకు పడినట్లు టాక్. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది సమంతను పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటూ అడగడంతో ఆమె అలా అడిగిన వారందరికీ సమాధానం ఇవ్వలేక తప్పించుకుని తిరిగినట్లు టాక్. 


అంతేకాదు తాను ప్రారంభించిన డే కేర్ పై అభిప్రాయాలు చెపుతూ మరిన్ని సూచనలు ఇవ్వకుండా ఇలా తనను ప్రశ్నలతో కార్నర్ చేయడం సమంత కు అసౌకర్యాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. దీనితో సెలెబ్రెటీ లకు కూడ ఇలాంటి సాధారణ ప్రశ్నలు తప్పవు అన్న విషయం సమంత విషయంలో కూడ నిజమైంది అని అనుకోవాలి. ‘జాను’ ఫెయిల్యూర్ తరువాత కూడ సమంత డేట్స్ ఇస్తే చాలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను తీస్తాము అంటూ అనేకమంది క్యూ కడుతున్నా సమంత మాత్రం ఎవరికీ ఓకె చెప్పకుండా ఒక అద్భుతమైన కథ గురించి అన్వేషణ కొనసాగిస్తోంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: