బాలీవుడ్ బాద్‌షా అని ఎవ‌రినంటారో అంద‌రికీ ఇప్ప‌టికే తెలిసి ఉంట‌ది. య‌స్ అలా షారుక్‌ఖాన్‌ని మాత్ర‌మే బాలీవుడ్ బాద్‌షా అంటారు. మ‌రి ఈయ‌న‌కి కూడా ఇండ‌స్ట్రీలో ఎఫైర్స్ త‌క్కువేం కాదండోయ్‌. ఎఫైర్లు కాస్త  గ‌ట్టిగానే న‌డిపాడు. అయితే షారూక్, జూహీచావ్లా చాలా కాలం పాటు హిట్ పెయిర్‌గా అనుకున్నారు అంతా. అయితే వారిద్ద‌రు ఎక్కువ సినిమాల్లోన‌టించారు. అంద‌రూ వారిద్ద‌రినీ ల‌వ‌ర్స్ అని కూడా అనేశారు అప్ప‌ట్లో అయితే వీరిద్ద‌రు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్‌. ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు స‌హాయం చేసుకునేవారు త‌ప్పించి వీరిద్ద‌రి మ‌ధ్య మాత్రం ఎలాంటి సంబంధం లేదు. కానీ వారిద్ద‌రి పై కూడా చాలా వార్త‌లు వెల్లువెత్తాయి అప్ప‌ట్లో. 

 

ఆ త‌ర్వాత కాజోల్, షారుక్ రొమాంటిక్ చిత్రాల‌కు పెట్టింది పేరు లాగా ఉండేవారు ఈ పెయిర్‌.  రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు వీరిద్ద‌రూ లీన‌మ‌యిపోయిమ‌రీ చేస్తారు. దీంతో కాజోల్‌కి ఓ సంద‌ర్భంలో అజ‌య్‌దేవ‌గ‌న్ గ‌ట్టి వార్నింగ్ కూడా ఇచ్చార‌ని స‌మాచారం. `సూర‌జ్ హువా మ‌ద్ద‌న్ చాంద్ జ‌ల్‌నే ల‌గా` అన్న సాంగ్‌లో వీరిద్ద‌రూ మైమ‌రిపోయి మ‌రి న‌టించారు. దీంతో ఈ పాట‌ను చూసిన కాజోల భ‌ర్త అజ‌య్ ఇక పై షారూక్‌తో న‌టించ‌డానికి వీలు లేదంటూ కండీష‌న్ కూడా పెట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.  ఇక ఆ త‌ర్వాత ప్రియాంక చోప్రా షారూక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రూ అయితే కొన్ని రోజులు డేటింగ్ కూడా చేశార‌ట అప్ప‌ట్లో. అది తెలుసుకున్న గౌరీఖాన్ ఇక రంగంలోకి దిగ‌క త‌ప్ప‌దు అని ఆమె ఇన్‌వాల్వ్ అయి ప్రియాంక‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వీరిద్ద‌రి రిలేష‌న్‌కి ఫుల్‌స్టాప్ పెట్టింద‌ట‌. 

 

ఇక ప్ర‌స్తుతం ఉన్న హీరోయిన్ల‌లో అయితే దీపిక‌ప‌దుకొనేను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది షారుకే. మ‌ళ్ళీ వీరిద్ద‌రి మ‌ధ్య కూడా కాస్త య‌వ్వారం న‌డిచింద‌ట‌. కొంత కాలం య‌వ్వారం న‌డిచాక దీపిక మ‌ళ్ళీ ర‌ణ్‌వీర్‌ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: