తెలుగు, తమిళంలో హీరో సూర్యకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  గజిని చిత్రం తర్వాత సింగం సీరీస్ తో ఆకట్టుకున్నాడు.  తమిళ్ లో సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు లో డబ్ అవుతున్న విషయం తెలిసిందే.   హీరో సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సూర్య నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. రీసెంట్ గా వచ్చి బందోబస్తు   సైతం భారీ నష్టాలనే మిగిల్చింది.  వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్న సూర్య క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.  సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. అపర్ణ బాలమురళి కథానాయిక. ఊర్వశి, మోహన్‌బాబు, జాకీష్రాఫ్‌, కరుణాస్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు.

 

ఇటీవలే ఈ చిత్రం సింగిల్‌ ట్రాక్‌ను విమానంలో విహరిస్తూ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా ఈ చిత్రం విడుదలవుతోంది.  ఈ సందర్భంగా మోహన్ బాబు సూర్య గురించి ఎంతో గొప్పగా పొగిడిన విషయం తెలిసిందే. ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.  అయితే ఈ చిత్రం హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.హిందీలో గునీత్‌ మోంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయట. నటీనటులు, ఇతర సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయని సమాచారం.

 

ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి హిట్ టాక్ ఉన్న చిత్రాలు బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సూర్య తమ్ముడు కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ చిత్రం సైతం బాలీవుడ్ లో రిమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.  ఈ మూవీలో మొన్నటి వరకు హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ నటిస్తారని భావించినా.. ఆ స్థానంలో అజయ్ దేవగాన్ వెళ్లినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: