తెలుగు లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తనదైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది హీరోయిన్ తమన్నా. ఇక తన అందాల ఆరబోతతో ప్రేక్షకులందరికీ మతి పోగొట్టింది ఈ తెల్లతోలు అమ్మడు. ప్రేక్షకుల మిల్కీ బ్యూటీ గా మారిపోయి.. ఎంతగానో అలరించింది. తెలుగులోనే స్టార్ హీరోలందరి సరసన నటించి తన డాన్సులతో తన నటనతో తన అందంతో అందరిని కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడి అందాలకు అయితే నిద్ర పట్టని రాత్రి లో గడిపారు అభిమానులు. అందం అభినయం కలగలిసిన తెల్లతోలు ముద్దుగుమ్మ తమన్నా. అయితే మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం చేతిలో సినిమాలు లేక ఖాళీగానే ఉండిపోతుంది. 

 

 

 అయితే మంచి చిత్రాల్లో అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను అంటోంది తమన్నా. పెద్ద స్టార్లతో నటించేందుకు  తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ చెబుతోంది. అయితే ఇప్పటికే దక్షిణాదిలో పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఉత్తరాదిలోను  స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగులో సిటీ మార్ అనే ఒకే ఒక చిత్రం ఉంది.  హిందీలో కూడా ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రధాన పాత్రలో  లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన దట్ ఇస్ మహాలక్ష్మి సినిమా అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 

 

 

 అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు టకాటకా సమాధానం చెప్పేసింది. ఇప్పటికీ మీరు చాలా స్లిమ్ గా అందంగా ఉండడానికి కారణం ఏమిటి అని ఓ అభిమాని  ప్రశ్నించగా... దానికి కారణం తన తల్లిదండ్రులు అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఇక నటుడు సూర్య తల అజిత్ లతో నటించే అవకాశం వస్తే నటిస్తారా అని మరో అభిమాని  ప్రశ్నించగా... హీరో సూర్య తో తన ఇంతకుముందే అయాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించానని.. సూర్య  తో నటించడం ఎప్పుడూ ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది. ఇక నటుడు అజిత్ వీరం చిత్రంలో నటించినట్లు గుర్తు చేసుకున్న ఈ అమ్మడు ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు కూడా అంటూ బదులిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: