నితిన్-వెంకి కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. దాంతో మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన ఈ చిత్రం  నాలుగో రోజు కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 1.80 కోట్ల షేర్ తో నాలుగు రోజుల్లో 16.71 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో మూడు కోట్లు రాబడితే  అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుండగా ఈవారం ఆ ఫీట్ ను చేరుకోవడం ఖాయం.
 
మరో వైపు  భీష్మ యూఎస్ఏ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్  చేసి లాభాలను రాబడుతుంది. ఇప్పటివరకు అక్కడ ఈ చిత్రం 700k వసూళ్లను రాబట్టింది ఫుల్ రన్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరనుంది. ఇక  ఉగాది వరకు పెద్ద సినిమాలు  ఏవి లేనందున భీష్మ  లాంగ్ రన్ కొనసాగించనుంది. దాంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం 30కోట్ల షేర్ మార్క్ ను  టచ్ చేయనుంది. 
 
భీష్మ వసూళ్ల వివరాలు : 
నైజాం - 6.64 కోట్లు 
సీడెడ్ - 2.55 కోట్లు 
ఉత్తరాంద్ర - 2.13 కోట్లు 
గుంటూరు - 1.51 కోట్లు 
తూర్పు గోదావరి - 1.32 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.97 కోట్లు '
కృష్ణా - 1.05 కోట్లు 
నెల్లూరు - 0.54 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4 రోజుల షేర్ = 16.71 కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: