తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ర‌జ‌నీ స్థాయి అంచనాలు అందుకోలేక పోయినా.. ర‌జ‌నీ గత సినిమాలు అయిన కాలా, కబాలి తో పోలిస్తే బెట‌ర్ అనిపించింది. ఈ సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోవడంతో వాళ్లంతా దర్శకుడు మురుగదాస్ తో పాటు హీరో రజనీకాంత్ ఇంటికి వెళ్లి తమను ఆదుకోవాలని నానా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రజనీకాంత్ త‌న నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నారు.



ఇక అసలు విషయంలోకి వెళితే అజిత్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో రజినీకాంత్ తన 168వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘అన్నాత్తే’ అనే టైటిల్ ని పెట్టారు. ఇక ర‌జనీ ప్ర‌తి సినిమా తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు తెలుగులో అన్న‌య్య లేదా పెద్ద‌న్న‌య్య అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌. ఈ రెండు టైటిల్స్ లో చిరు హీరోగా గ‌తంలో అన్న‌య్య సినిమా వ‌చ్చింది.



బాల‌య్య హీరోగా పెద్ద‌న్న‌య్య వ‌చ్చింది. అయితే ఈ రెండు సినిమాల‌లో ర‌జ‌నీ మాత్రం పెద్ద‌న్న‌య్య టైటిల్ పైనే ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎమోషనల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, కుష్బూ, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ర‌జ‌నీ గ‌త సినిమాలు ర‌జ‌నీ రేంజ్‌ను అందుకో లేక‌పోతున్నాయి. ఇక అజిత్ తో వ‌రుస హిట్లు ఇచ్చిన శివ అయినా ర‌జ‌నీ రేంజ్‌కు త‌గ్గ హిట్ ఇస్తాడేమో ?  చూడాలి.



ఇక సన్ పిక్చర్స్ నిర్పిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ కి డి. ఇమ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్ చివ‌ర్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ర‌జ‌నీ - శివ కాంబో కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: