ఒకటి కాదు.. రెండు కాదు కొత్తగా తీస్తున్న ఏ సినిమా అయినా సరే ఎలాగో అలా స్పాట్ కి సంబంధించిన ఫోటోలు లీక్ చేస్తున్నారు లీకేజీరాయుళ్లు.  ఎంతో సీక్రెట్ గా ఫస్ట్ లుక్ రివీల్ చేయాలనే తాపత్రయంతో ఉండే చిత్ర యూనిట్ అప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న లీక్ లతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది.  అయితే ఈ లీకేజీలు అరికట్టడం ఎవరి వల్ల కాదు.. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు అంత ఫాస్ట్ అవుతుంది.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ లీకేజీల గోల మరీ ఘోరంగా మారింది.  రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు ఎంతో పకడ్భందీగా షూటింగ్స్ నిర్వహిస్తుంటారు.. ఆయన ఉన్న చోట స్పై కెమెరాలు సైతం పెడుతుంటారు. కానీ ఎక్కడో అక్కడ లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి.

 

ఎన్ని జాగ్రత్తలు వహించినా లీకులు మాత్రం ఆగట్లేదు. బాహుబలి నుండి ఆర్.ఆర్.ఆర్ వరకూ ఏదో విధంగా లీకులు బయట పడుతున్నాయి. ఆ మద్య సైరా నరసింహారెడ్డి చిరు లుక్ ఎంతో జాగ్రత్తగా కాపాడలాని చూసినా లీకేజ్ అయ్యింది.  తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీకి సంబంధించి ఓ లుక్ బయటకొచ్చింది. కేవలం లుక్స్ మాత్రమే కాదు.. ఏకంగా కొన్ని సినిమాలు సైతం సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.   అప్పట్లో 'అత్తారింటికి దారేది' సినిమా సగం పైనే లీకైంది. అప్పట్లో ఆ లీక్ దుమారం లేపింది. ఆ తర్వాత 'టాక్సీ వాలా' అని సినిమా కూడా విడుదలకి ముందే మొబైల్ లోకి వచ్చేసింది.

 

చిరు ఎర్ర టవల్ వేసుకొని నక్సలైట్ గా కనిపించే స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మద్య పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ నుండి కూడా పవన్ ఫైట్ చేసే ఓ సీన్ నెట్ లోకి వచ్చేసింది. ఇలా వరుసగా స్టార్ హీరోలకు సంబంధించి లుక్ రివిల్ అవుతుంటే.. ఇక ఫస్ట్ లుక్ ఎలా రిలీజ్ చేయాలన్న ఆవేదనలో ఉంటున్నారు దర్శక, నిర్మాతలు. ఇంత పెట్టుబడులు పెట్టి సినిమాలు తీయడం.. లీకేజీలతో భయపడటం కష్టమని..ఇలా అయితే చేతులెత్తే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు మూవీ మేకర్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: