బాలకృష్ణ... విజయ శాంతి’ తెలుగు సినిమా పరిశ్రమలో వీళ్ళ గురించి తెలియని వారుండరు. ఒకప్పుడు ఈ జోడీ చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు విజయశాంతి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకున్నారు విజయశాంతి. ముఖ్యంగా అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేయడమే కాకుండా... ప్రత్యేక పాత్రలు కూడా చేసింది. దీనితో ఆమెకు అప్పట్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. బాలకృష్ణ కూడా తండ్రి వారసత్వాన్ని అందుకున్నారు. 

 

అయితే ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడిచింది అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలోనే బాలకృష్ణ విజయశాంతిని ప్రేమిస్తున్నట్టు చెప్పారట. దీనికి ఎన్టీఆర్ ససేమీరా అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. వీరు ఇద్దరూ కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు. ఈ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. విజయశాంతి చేసే సినిమాల విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ పెట్టే వారట.  ఆమెను అగ్ర దర్శకులకు పరిచయం చేసింది కూడా బాలకృష్ణే అనేది అప్పట్లో ఎక్కువగా ప్రచారం జరిగింది. 

 

హీరోయిన్ ని పెళ్లి చేసుకోవద్దు అని ఎన్టీఆర్ పట్టుబట్టడం తోనే బాలకృష్ణ ఆ వివాహం చేసుకోలేదని అంటారు. ఆ విషయం ఇంట్లో తెలిసిన వెంటనే ఎన్టీఆర్... సంబంధం చూసి బాలకృష్ణ కు పెళ్లి చేసారని అంటారు. ఆ తర్వాత కూడా వీరి మధ్య కొంత కాలం ప్రేమ నడిచింది అని, విజయశాంతి శ్రీనివాస్ అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకోవడంతో ఒకరికి ఒకరు దూరం అయ్యారని ఎవరికి తోచిన వార్తలు వాళ్ళు రాసేవారు. ఇప్పటికీ ఈ జోడి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు పలానా సినిమాలో నటిస్తున్నారు, బాలయ్యకు విలన్ గా విజయశాంతి నటిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: