క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌ని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ న‌టి లిజి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ దంప‌తుల ముద్ద‌ల కుమార్తె అయిన క‌ళ్యాణి. అమెరికాలో చదువుకున్న కల్యాణి ప్రియదర్శన్‌ తన తల్లిదండ్రుల మాదిరిగానే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అక్కినేని అఖిల్ స‌ర‌స‌న హ‌లో సినిమాలో న‌టించింది.



ఆ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత మాతృభాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా హీరో చిత్రంతో దిగుమతి అయ్యింది. ఇక ఇప్పుడు అదే కోలీవుడ్‌లో శింబు ప‌క్క‌న మానాడు చిత్రంలో నటిస్తోంది. ఇక ఇటీవ‌లే త‌న త‌ల్లితో క‌లిసి ఓ యాడ్‌లో కూడా న‌టించింది. ఇక క‌ళ్యాణి కొద్ది రోజులుగా మోహ‌న్‌లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్‌తో క‌లిసి ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.



ఇవి ఇలా ఉంటే క‌ళ్యాణి తాజాగా త‌న పెళ్లిపై నోరు విప్పింది. త‌న పెళ్లి గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు అవ‌స‌రం లేద‌ని చెప్పింది. తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటాన‌ని... క‌ళ్యాణి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ప్రేమ విషయంలో తాను సినిమా ఫక్కీని కోరుకుంటున్నాన‌ని.. త‌న ప్రేమికుడు త‌న‌కు ఎదురైన‌ప్పుడు త‌న హార్ట్ తీయ తీయ‌ని మాట‌ల్లో విహ‌రిస్తుంద‌ని తాను అనుకుంటున్నాని క‌ళ్యాణి చెప్పింది.



త‌న ప్రేమ పెళ్లిపై ఎలాంటి చిలువ‌లు ప‌ల‌వ‌లు అవ‌స‌రం లేద‌ని కూడా ఆమె చెప్పింది. తాను ప్రేమించిన వాడి విష‌యం టైం వ‌చ్చిన‌ప్పుడే తానే బ‌య‌ట పెడ‌తాన‌ని కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఏదేమైనా సినిమా రంగం నుంచి వ‌చ్చిన క‌ళ్యాణి మాట‌లు కూడా త‌ల్లిదండ్రుల‌ను మించిన‌ట్టుగానే ఉన్నాయ‌ని ప‌లువురు నెటిజ‌న్లు అంటున్నారు. మ‌రి క‌ళ్యాణి ప్రేమికుడు ప్ర‌ణ‌వే అవుతాడా ?  లేదా ? ఎక్క‌డున్నాడో ఆమె చెప్పాల్సి ఉంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: