సినిమా వాళ్ళ గురించి చిన్న వార్త వచ్చినా సరే చేసే హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ఎఫైర్ల గురించి ఎక్కువగా ప్రచారం చేసే వాళ్ళు జనం. మీడియా అయితే వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా సరే దాని గురించి ప్రత్యేక డిబేట్ లో కూడా పెడుతూ సందడి చేస్తుంది. అనవసరమైన వార్తలు అన్నీ మీడియాలో వస్తూనే ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రేమ కథల గురించి అయితే వాళ్ళు టిఫిన్ తిన్నా వాంతు చేసుకున్నా సరే ఒక వార్త రాస్తూ ఉంటారు. 

 

ఇలాగే చేసారు అనుష్క గోపిచంద్ విషయంలో. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం చేసారు అప్పట్లో. అనుష్క.. కెరీర్ లో నిలబడుతున్న సమయంలో గోపి చంద్ తో ప్రేమలో పడింది అంటారు. అది నిజమో కాదో తెలియదు గాని అప్పట్లో అభిమానుల్లో చర్చలు కూడా దీనిపై ఎక్కువగానే జరుగుతూనే ఉండేవి. ఏదైనా కార్యక్రమంలో వీళ్ళు కలిసినా సరే వార్తలు ఎక్కువగా వచ్చేవి. ఇక అనుష్క కోసం ఒక ఇల్లు కూడా గోపి చంద్ హైదరాబాద్ లో కొన్నాడని ప్రచారం జరిగింది. 

 

అనుష్క ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయింది. గోపి చంద్ మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. వీళ్ళు పెళ్లి చేసుకోవాలని చూసినా ఒక స్టార్ హీరో అడ్డం పడ్డాడని అంటారు. ప్రస్తుతం అనుష్క కెరీర్ లో దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు కి దగ్గరలో ఉన్నా సరే అనుష మంచి సినిమాలు చేస్తూ తన స్టార్ హోదాను కాపాడుకుంటూ వెళ్తుంది. గోపి చంద్ కూడా కాస్త ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు కూడా. ఏది ఎలా ఉన్నా అప్పట్లో ఈ వార్త కాలేజ్ స్టూడెంట్స్ లో కూడా ఎక్కువగా వినపడేది.

మరింత సమాచారం తెలుసుకోండి: