స్టార్ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన నటుడు దగ్గుబాటి రానా. మూవీ మొగళ్‌ రామానాయుడు మనవడిగా, టాప్‌ ప్రొడ్యూసర్‌ సురేష్‌ బాబు, స్టార్ హీరో వెంకటేష్‌ల వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన రానా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఉత్తరాదిలోనూ సత్తా చాటాడు. హీరోగా పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు.

 

రెండో సినిమానే బాలీవుడ్‌లో చేసిన రానా.. డస్కీ బ్యూటి బిపాషా బసుతో ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అద్భుతంగా పండించాడు. అయితే ఆ సినిమా సమయంలో బిపాషాతో రానా సంథింగ్ సంథింగ్‌ అంటూ బాలీవుడ్‌ మీడియాలో గట్టిగానే వార్తలు వినిపించాయి. అయితే ఆ గాసిప్స్‌కు పెద్దగా ఛాన్స్‌ ఇవ్వకుండా వెంటనే సౌత్‌ సినిమాల మీద దృష్టి పెట్టాడు రానా. కెరీర్‌ తొలినాళ్లలోనే రానా ఘాటు ప్రేమలో మునిగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి.

 

చెన్నై చంద్రం త్రిషతో ఈ మ్యాన్లీ హంక్‌ కాస్త ఘాటు ప్రేమాయణమే నడిపించాడట. చాలా సినిమా ఫంక్షన్లతో పాటు పలు ప్రైవేట్‌ పార్టీలలోనూ రానా, త్రిషలు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ టాలీవుడ్‌, కోలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వినిపించాయి. పలువరు సెలబ్రిటీలు కూడా వీరి రిలేషన్‌కు సంబంధించి సెటైర్స్‌ వేయటంతో నిజంగా రాష, త్రిష మధ్య ఏదో ఉందన్న అనుమానాలు వచ్చాయి. 2014 వరకు బాగానే సాగిన వీరి రిలేషన్‌ తరువాత బ్రేకప్‌ అయ్యింది. త్రిష మరో వ్యాపార వేత్తతో ప్రేమలో పడటంతో రానా ఒంటరివాడయ్యాడు.

 

అలా అని అక్కడితో రానా లవ్‌ లైఫ్‌ ఏం ముగిసిపోలేదట. తరువాత కూడా కొంత మంది సౌత్‌ నార్త్‌ హీరోయిన్లతో రానా ఎఫైర్‌ అంటూ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కానీ రానా మాత్రం ఆ వార్తలను లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: