కొందరు సినిమా హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నాయని, వారు డేటింగ్‌లో ఉంటున్నారని రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ వార్తలు నిజమా? లేక రూమర్సేనా అనేది సదరు హీరో గానీ, హీరోయిన్ గానీ స్పందిస్తేనే తెలుస్తుంది. అయితే వాస్త‌వానికి సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ స్టోరీలు చాలా కామన్. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో లవ్ ఎఫైర్స్ కాస్త తక్కువగానే కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ కూడా అదే రేంజ్‌లో ప్రేమ వ్య‌వ‌హారాలు జ‌రుగుతున్నాయి. కొందరు హీరోయిన్లు తమ కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ పడకుండా.. ఇలాంటి విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ, ఏదో విధంగా ఆ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. 

 

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ఆయ‌నో టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు. ఈ ఫ్యామిలీ గురించి తెలియ‌ని వారుండ‌రు. రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ లో వున్న ఆయన, విభజన తర్వాత టీడిపీ లోకి వచ్చారు. సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. తమ అభిప్రాయలు డైరెక్ట్ గా ఎక్ష్ప్రెస్స్ చెయ్యరు. కాని, ఈయ‌న‌ మాత్రం తన అభిప్రాయలు నిర్మొహమాటంగా చెప్తారు. దేనికి భయపడరు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే ఆయన స్టైల్.  ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో  వీరి ఫ్యామిలీ సంచాలనాలకు మారు పేరుగా మారారు. ఇక తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి అడుగులు వేశాడు ఈయ‌న కుమారుడు. 

 

ఈ యువ‌నేత‌ తెల‌గుదేశం పార్టీలో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. వీళ్ల‌కు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అయితే తొలి సారి గ‌త ఎన్నిక‌ల‌ బ‌రిలో దిగిన ఈ యువ‌నేత వైసీపీ ఫ్యాన్ గాలికి త‌ట్టుకోలేక ఓట‌మిపాల‌య్యారు. ఈయ‌నకు గుర్రాల‌ రేసుల పిచ్చి కూడా ఉంద‌ని స‌మాచారం. అయితే ఈ యువ‌నేత‌కు, టాలీవుడ్ బ‌క్క‌ప‌ల్చిన హీరోయిన్‌కు ఎఫైర్ న‌డుస్తుంద‌ని గ‌త కొంత‌కాలంలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ చిన్న ల‌వ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ త‌ర్వాత చాలా పాపుల‌ర్ అయింది. ఈ క్రమంలోనే  వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ఖాతాలో కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. 

 

అయితే ఎన్ని హిట్స్ ఇచ్చినా.. ఆమెకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. మెగా హీరో స‌ర‌స‌న కూడా ఆడిపాడింది ఈ బ్యూటి. అయిన‌ప్ప‌టికీ.. ఆమె తోటి హీరోయిన్లు టాప్ లీగ్‌లో దూసుకుపోతుంటే ఈమె మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలిగింది. అంతేకాదు, ఈ భామ మెగా హీరోతో పాటు ఓ యంగ్ హీరోతో ఎఫైర్లు ఉన్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత టీడీపీ మాజీ ఎంపీ కొడుకుతో ఎఫైర్ న‌డిపిన‌ట్టు చ‌ర్చ‌లు న‌డిచాయి. అంతేకాకుండా, వీరిద్ద‌రూ బెంగుళూర్‌లో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన‌ట్టు టాక్ కూడా ఉంది.

   
 

  

మరింత సమాచారం తెలుసుకోండి: