ఈ మద్య తెలుగు టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ సంపాదించిన యాంకర్స్ వెండితెరపై కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు.  ఇక ఈ భామలు సోషల్ మీడియాలో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెంచేసుకుంటూ పోతున్నారు.  జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన అనసూయ తన అందాలు, మనుసు దోచే మాటలతో కుర్రాళ్లను ఫిదా చేసింది.  ఇద్దరు పిల్లల తల్లి అయినా అనసూయకు యూత్ లో ఓ హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ ఉంది.  ఈ మద్య తన వొంపు సొంపులతో అందమైన బట్టలు వేసుకొని ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది.  బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తున్న అనసూ ప్రస్తుతం నటిగా మంచి ఫామ్ లో ఉంది.  సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మంచి హిట్ అందుకుంది.  

 

ఈ చిత్రంలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది.  ఇదిలా ఉంటే.. ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నితిన్, మరో వైపున నిర్మాతగాను సొంత బ్యానర్ పై సినిమాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా భీష్మ చిత్రంలో మంచి హిట్ అందుకున్నాడు నితిన్.  తాజాగా తన బ్యానర్ పై ఆయన 'అంధదూన్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. నిన్ననే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.  హిందీ వర్షన్ లో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది ‘టబు ’. తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నటుగా వార్తలు వచ్చాయి.

 

ఆ జాబితాలో యాంకర్ అనసూయ పేరు వున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.   టు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి విపరీతమైన క్రేజ్ వుంది. గతంలో క్షణం చిత్రంలో అనసూయ నెగిటీవ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. హిందీలో 'టబు' పోషించిన పాత్ర తరహా నటనకి అనసూయ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ పాత్ర పడితే అనసూయ మరింత లక్కీనే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: