జగపతిబాబుగా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన వీరమాచనేని జగపతి చౌదరి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. టాలీవుడ్ లో ఏ విషయాన్ని అయినా నిర్మోహమాటంగా చెప్పేవారిలో జగపతిబాబు ముందు వరసలో ఉంటారు. తనకు అలవాట్లు..తాను చేసిన పొరపాట్లు కూడా నిర్మోహమాటంగా వెలిబుచ్చుతారు. 

 

జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్నాడు జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా 1990లలో ఎన్నో చిత్రాలతో మెప్పించిన జగపతిబాబు కాలక్రమేనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా మారిపోయాడు. కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిన టైమ్ లో బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటించడంతో జగ్గూభాయ్ కెరీర్ ఎలా టర్న్ అయిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా విలనిజానికి జగపతిబాబు ఇప్పుడు కేరాఫ్ అడ్రెస్ అయ్యారు. 

 

అయితే, నిజానికి ఒకప్పుడు జగపతిబాబు ఫ్యామిలీ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి ఫ్యామిలీ హీరోగా ఓ రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించారు. ఈ టైమ్ లోనే జగపతిబాబు అనేక మంది హీరోయిన్స్ తో ఎఫైర్ కొనసాగించాడనే రూమర్లు వినిపించేవి. ఆ హీరోయిన్స్ లిస్టులోనే అప్పుడు అందాల తార సౌందర్య కూడా ఉండటం గమనార్హం. గతంలో జగపతిబాబు నటించిన  ప్రియరాగాలు, అల్లరి ప్రేమికుడు, సర్దుకుపోదాంరండి, పెళ్లిపీటలు, భలే బుల్లోడు, దొంగాట సినిమాల్లో సంద‌ర్య న‌టించింది.

 

ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో జగపతిబాబు, సౌందర్య ని టాలీవుడ్ హిట్ పెయిర్ గా గుర్తించారు. అలానే వీరి మధ్య ఎఫైర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు, నాటి ఆమ‌ని నుంచి.. నేటి ప్రియ‌మ‌ణి వ‌ర‌కు జ‌గ‌ప‌తిబాబుతో ఎఫైర్లు ఉన్నాయంటూ రూమ‌ర్లు పుట్టించేసేవారు. జగపతిబాబు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కొందరు హీరోయిన్లతో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టింది మీడియా. అప్పట్లో ఆ రూమర్లను ఆయన ఖండించింది కూడా లేదు. అయితే వాస్త‌వానికి జ‌గ‌ప‌తిబాబు ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించినా.. ఆయ‌న జెంటిల్మెన్ అని అంద‌రికీ తెలుసు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: