రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అరణ్య'. ఈ సినిమాను అడ్వంచరస్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా, మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అరణ్య', తమిళ వెర్షన్ 'కాడన్'లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ 'హాథీ మేరీ సాథీ'లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.

 

కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడు. రానా ఫస్ట్ లుక్ కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు ఈ లుక్‌ను షేర్‌ చేస్తున్నారు.. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. వాటిలో దేన్ని ఫైనల్ చేశారో మొదటిరోజు షూటింగ్ లో పాల్గొనేదాకా ఆయనకు కూడా వారు చెప్పలేదు.

 

ఆ పాత్ర కోసం తన రూపాన్ని ఎలా మార్చుకున్నదీ రానా వెల్లడించారు. `డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్` అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: