సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల మధ్య లవ్ ఎఫైర్లు, డేటింగ్ గాసిప్‌లు అనేవి ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కొందరు తమ తమ సినిమాల పబ్లిసిటీ కోసం, తమ పాపులారిటీ పెంచుకోవడం ఎఫైర్లు కొనసాగిస్తుండటం గమనార్హం. అయితే కొందరు స్టార్స్ మాత్రం సీరియస్‌గా రిలేషన్ షిప్ నడిపిస్తున్నారు. ఇందులో కొన్నాళ్లు డేటింగ్ను ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకునేవారు కొందరైతే.. ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కేవారు మరికొందరు. ఇక టాలీవుడ్ లో ఇలాంటి వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి.
గత నాలుగైదు దశాబ్దాల నుంచి ఈ తంతు నడుస్తోంది. ఇక ఇప్పడు ఇది మరీ విచ్చలవిడి అయిపోయింది. అసలు విషయంలోకి వస్తే.. ఓ బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టిందామె. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలియని వారుండరు. ఎందుకంటే ఈ బ్యూటి అంత పాపులర్. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన సదరు హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటికీ ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ, ఈ మధ్య కాలంలోనే ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే సదరు హీరోయిన్‌కు, ఆ బడీ ఫ్యామిలీకి చెందిన సీనియర్ హీరోకు మధ్య ఎఫైర్ ఉన్నట్టు రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఆ తర్వాత ఆ సీనియర్ హీరో కుమారుడితోనే సదరు హీరోయిన్ పెళ్లంటూ ప్రధాన మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. అప్పట్లో అవి బాగా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే అదే ఫ్యామిలీకి చెందిన మరో హీరోతో కూడా సదరు హీరోయిన్ సినిమా చేయడంతో.. మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు వచ్చాయి. ఇలా అనేక విధాలుగా పుకార్లు పుట్టుకురావడంతో సదరు సీనియర్ హీరో ఆ స్టార్ హీరోయిన్ను దూరంగా పెట్టారు. అంతేకాకుండా ఆమెను తన కాంపౌడ్‌కు కూడా రానివ్వద్దని సెక్యూరిటీకి ఆదేశించడం గమనార్హం. దీంతో ప్రస్తుతం సదరు స్టార్ హీరోయిన్ ఆ బడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తోంది.