ఆ రోజుల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ విలక్షణమైన నటనతో తనదైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సత్యప్రకాష్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు అన్నింటిలో సత్యప్రకాష్... విలన్ పాత్రలో కనిపించే వాడు. ఇక తనదైన పవర్ఫుల్ విలనిజంతో అదరగొట్టాడు. ఇక సత్యప్రకాష్ డైలాగ్ డెలివరీ అయితే ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించేది. అయితే ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రకాష్ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో తెలుగు తెరపై కొంచెం కొంచెంగా కనుమరుగయ్యారు. 

 

 

 అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యప్రకాష్ తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నేను హీరో రవితేజ మంచి స్నేహితులం అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసినా నటుడు సత్య ప్రకాష్... అప్పట్లో ఇద్దరూ కలిసి బైక్పై తిరిగే వాళ్లమని... చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు. రవితేజ కంటే ముందు నటుడిగా నేను సినిమాల్లోకి వచ్చి ఒక స్థాయికి ఎదిగానని ఆ తర్వాత రవితేజ చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇప్పుడు హీరోగా మారిపోయాడు అని తన కంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయాడు అంటూ నటుడు సత్యరాజ్ తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటికీ ఒకప్పటి  పొజిషన్ లోనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 

 అలాగే ప్రకాష్ రాజు కూడా తనకు ఎంతో మంచి స్నేహితుడు అని తెలిపిన సత్యప్రకాష్... ప్రకాష్ రాజు కూడా తన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు అంది పుచ్చుకుంటూ తనను  దాటుకుంటూ ఎదిగిపోయాడు అంటూ తెలిపాడు. అయితే గతంలో మా మధ్య ఉన్న స్నేహ బంధం అనుబంధం ఇప్పుడు లేదు అంటూ ఆయన తెలిపాడు. అయితే వాళ్ళిద్దరికీ మంచి స్టార్డం వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా మారిపోతూ ఉంటుంది... ఈ క్రమంలో ఒకప్పటి లాగే వాళ్లు నాతో ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు. అయితే నాతో కెరీర్ మొదలుపెట్టి వాళ్లలో నా  స్థాయికి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళతో నేను ఎప్పటి లాగే ఉంటాను... ఒకప్పటి చనువుని ప్రదర్శిస్తూ ఉంటాను అంటూ సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: