సినీ ఇండ‌స్ట్రీ అనే రంగుల ప్ర‌పంచంలో ఎన్నో జ‌రుగుతుంటాయి. హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు.. అక్రమ సంబంధాలు.. ఛాన్సుల కోసం ఒకరికి ఒకరు కోపరేట్ చేసుకోవటం ఇలాంటివి సినిమా రంగంలో అత్యంత సహజం.  అలాగే కొన్నాళ్లు డేటింగ్‌ను ఎంజాయ్ చేయ‌డం, ఆ త‌ర్వాత ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డం అక్క‌డి స్టైల్‌. చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. ఆయ‌నో ప్రముఖ బహుబాష హీరో. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంలోనూ న‌టించిన ఈయ‌న ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 

మ‌రియు వీరిద్ద‌రూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అదే టైమ్‌లో స‌ద‌రు హీరోకు.. సౌత్ ఇండియాలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో మంచి న‌టిగా పేరుతెచ్చుకున్న ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. స‌ద‌రు హీరోయిన్ ముక్కుసూటి తత్త్వం క‌ల‌ది. కోపం కూడా ఎక్కువే.. అందుకే ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇలా ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్టు మొహంమీద చెప్పే స‌ద‌రు హీరోయిన్ పై కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అయితే స‌ద‌రు హీరో, హీరోయిన్‌కు ఎఫైర్ ఉన్న‌ట్టు ప్రముఖ మీడియా లో సైతం వార్త‌లు హైలైట్ అయ్యాయి. 

 

ఈ రూమ‌ర్స్‌తో స‌ద‌రు హీరో ఫ్యామిలీ మొత్తం డిస్ట‌బ్ అయింది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు హీరో.. ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో స‌ద‌రు హీరో, హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటున్నారని.. అందుకే భార్య కు విడాకులిచ్చే సాహసం చేస్తున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే పెద్ద‌లు స‌ద్దిచెప్ప‌డంతో.. కోర్టులో విడాకులకు పిటీషన్లు పెట్టుకున్నా.. స‌ద‌రు హీరో ఆయన భార్య విడాకుల కేసుకు హాజరు అవ్వ‌కుండా క‌లిసే ఉంటున్నారు. ఆ త‌ర్వాత స‌ద‌రు హీరో.. త‌మ‌ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకుల కేసు వెనక్కి తీసుకున్నామని న్యాయవాది మీడియాకు చెప్పారు.

 
 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: