మహేష్ బాబు తో సినిమా అనగానే దర్శకులు యెగిరి గంతేస్తూ ఉంటారు. మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఆయనతో సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది దర్శకుల్లో. సినిమా ఎలా ఉన్నా సరే పెట్టిన పెట్టుబడి వస్తుంది అనే భావన కూడా నిర్మాతల్లో ఎక్కువగా ఉంటుంది. దీనితో ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు స్టార్ హీరోగా ఉన్నారు. ఆయనకు ఫాలోయింగ్ భారీగా ఉంది. దీనితో సినిమా విడుదల అనగానే భారీ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. 

 

ఇప్పుడు ఆ మార్కెట్ ని కూడా కొందరు దర్శక నిర్మాతలు కాదు అనడం సంచలనంగా మారింది. అసలు మహేష్ తో సినిమా అనగానే చాలా మంది ఇప్పుడు వెనకడుగు వేయడం ఆందోళన కలిగించే అంశం. మహేష్ బాబు ఇటీవల ఒక దర్శకుడికి ఫోన్ చేసి సినిమా చేద్దామని అడగగా ఆ దర్శకుడి నుంచి మహేష్ బాబుకి ఏ సమాధానం రాలేదని అంటున్నారు. కనీసం తిరిగి ఫోన్ కూడా చేయలేదని, కాని అదే దర్శకుడు ఒక టాలీవుడ్ స్టార్ హీరోని కలిసి సినిమా చేయడానికి ఒప్పించాడు అంటున్నారు. 

 

దీనితో మహేష్ బాబు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తాను పిలిస్తే రాని దర్శకుడు యువ హీరోకి ఏ విధంగా అవకాశం ఇచ్చాడు అని మహేష్ షాక్ లో ఉన్నాడట. ఇక కొందరు నిర్మాతలు కూడా ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా సరే, సరిలేరు నీకెవ్వరు సినిమా లాస్ లో ఉండటమే దీనికి కారణమని అంటున్నారు ఆ సినిమా ఊహించని విధంగా నష్టాలు మిగిల్చింది అని అంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకులు కొందరు సినిమా చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: