టైటిల్ చూసి పరేషాన్ కాకండి.. లోకేష్ అనగానే ఉలిక్కిపాటు వద్దు.. లోకంలో లోకేష్‌లు చాలామంది ఉన్నారు..  మిగతా మ్యాటర్ మొత్తం చదివితే ఆ లోకేష్ ఎవరో తెలిసిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరు శ్రీనివాస గౌడ..  కర్ణాటకకు చెందిన ఇతను కంబళ పోటీల్లో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.. ఎందులోనంటే.. ఇదివరకు పరుగుల చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ సాధించిన వరల్డ్ రికార్డ్ టైమింగ్ 9.58 సెకన్లు కాగా, గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే అధిగమించి, 0.3 సెకన్ల తేడాతో బోల్ట్ లాక్ చేసిన లాకర్‌ను తెరిచేసాడు.. రాత్రికి రాత్రే పరుగుల వీరుడిగా పెదవుల్లో నిలిచిపోయాడు..

 

 

ఇక ఇంతటి పేరు సంపాదించుకున్న శ్రీనివాస గౌడ కు ఓ సినిమాలో అవకాశం వచ్చింది.. త్వరలో రూపొందించనున్న ‘కంబళ’ అనే సినిమాలో ముఖ్య పాత్ర దక్కిందట.. ఈ ‘కంబళ’ చిత్రాన్ని అవార్డు విన్నింగ్ ఫిలిం మేకర్ అయిన నిఖిల్ మంజు  తెరకెక్కిస్తుండగా, లోకేష్ శెట్టి అనే అతను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట..

 

 

ఇకపోతే లోకేష్ శెట్టి మాట్లాడుతూ.. ప్రస్తుతం కంబళ పోటీలు జరుగుతున్నాయి... ఈ రేసులు ఇంకో రెండు వారాల పాటూ కొనసాగనున్నాయి. కాబట్టి తాము వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నామని’ అన్నారు. కంబళ పోటీలు ముగిసే లోపే చాలా వరకూ చిత్రీకరణ పూర్తీ చేయాలని, ఎందుకంటే ఆ తర్వాత దున్నపోతులు దొరకడం చాలా కష్టమని లోకేష్ శెట్టి తెలిపారు.

 

 

ఇక  ఈ చిత్రంలో నిజమైన జాకీలు, అసలైన ట్రైనర్లు కనిపిస్తారట.. కాగా కిషోర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండగా.. మొత్తం ఆరుగురు కంబళ జాకీలు సినిమాలో మంచి పాత్రల్లో కనిపించనున్నారట. ఆ ఆరుగురు జాకీల్లో శ్రీనివాస గౌడ కూడా ఒకరు. మిగిలిన లీడ్ క్యారెక్టర్లకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేస్తామన్నారు దర్శక నిర్మాతలు..

మరింత సమాచారం తెలుసుకోండి: